ఉచిత ఇసుక ఇస్తే ప్రజలు తీసుకోరా..!?

సాధారణంగా ఉచిత ఇసుక విధానంను మించిన గొప్ప పాలసీ ఉండదు . ఎందుకంటే.. అవసరమైన వారికి ఉచితంగానే ఇసుక వస్తోంది. రవాణా ఖర్చులు మాత్రమే భరించాలి. గత ప్రభుత్వంలో ఈ విధానం వల్ల నిర్మాణ రంగం కూడా ఎంతో మెరుగైంది. కొత్త ప్రభుత్వం ఇసుక విధానంతో ఏపీలో అసంతృప్తి కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇసుక విధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ.. ఏపీ సర్కార్ భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి ఏపీలో కొత్త ప్రభుత్వ వచ్చే వరకూ ఉచిత ఇసుక విధానం అమల్లో ఉంది. రవాణా చార్జీలు పెట్టుకుని కావాల్సినంత ఇసుక తీసుకెళ్లొచ్చు. ఇళ్లు కట్టాలనుకునుకేవారికి అప్పట్లో ఇసుక.. రవాణా చార్జీలకే వచ్చేది. ఎంత దూరం నుంచి తెప్పించుకుంటారనేదానిపై ధర ఆధారపడి ఉండేది.

కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఉచిత ఇసుకను రద్దు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నేతల జేబుల్లోని వస్తువు అయిపోయింది. వారు ఎంత రేటు చెబితే.. అంతకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా కాలం పాటు కొత్త విధానం పేరుతో అమ్మకాలు నిలిపేశారు. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు …బ్లాక్‌లో అమ్ముకుని కోట్లకు పడగలెత్తారు. ఆ తర్వాత ఆన్ లైన్ పేరుతో పూర్తిగా బ్లాక్ మార్కెట్‌దే రాజ్యం అయిపోయింది. ఇసుక అందుబాటులో లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. అయితే ఈ అసంతృప్తి ఇప్పటిది కాదు. ముందు నుంచీ ఉంది. కానీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. మరి ఇప్పుడే ఎందుకు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటోందనే సందేహం చాలా మందిలో వస్తోంది.

మరి ఇప్పుడే ఎందుకు ఇసుక ప్రజలకు అందడం లేదని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రజల నుంచి సలహాలు ఎందుకు తీసుకోవాలనుకుంటోందనేది చర్చనీయాంశంగా మారిది. ఉచితంగా ఇస్తే ప్రజలు తీసుకోరా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. ప్రజల పేరుతో.. తమకు కావాల్సిన విధానాన్ని రూపకల్పన చేసుకోవడానికి ప్రభుత్వం కొత్తగా గేమ్ ఆడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవుడి ఇమేజ్‌…సోనూలో క‌ల‌వ‌రం!

మ‌న హీరోల్ని దేవుడిగా చూడ‌డం అబిమానుల‌కు అల‌వాటే. వాళ్ల కోసం... గుళ్లో పూజ‌లు చేస్తుంటారు. క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు మామూలే. ఇక హార‌తులు, కొబ్బ‌రికాయ కొట్ట‌డాలూ రొటీన్ వ్య‌వ‌హారాలు. అయితే చాలా త‌క్కువ మంది...

జేసీ ఫ్యామిలీకి రూ. వంద కోట్ల జరిమానా..!

అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. వంద కోట్ల జరిమానా విధించింది. గతంలో ప్రభుత్వం నుంచి మైనింగ్ కోసం లీజుకు భూముల్ని...

చిరు ‘వేదాళం’ మొద‌లెట్టేశారా?

'ఆచార్య‌' త‌ర‌వాత‌... 'వేదాళం' రీమేక్ మొద‌లెట్ట‌బోతున్నాడు చిరంజీవి. బహుశా.. 2021 మార్చిలో 'వేదాళం' సెట్స్‌పైకి వెళ్లొచ్చు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే.. ఇప్ప‌టికే `వేదాళం`...

రాత్రికి రాత్రి పంటల బీమా సొమ్ము చెల్లింపు..!

పంటల బీమా విషయంలో అడ్డంగా ఇరుక్కుపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది. రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న...

HOT NEWS

[X] Close
[X] Close