గ్రేటర్ ఎన్నికల్లో టీ టీడీపీ బలం నిరూపించుకుంటుందా..!?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో గ్రేటర్ రాజకీయాల హడావుడి నడుస్తోంది. మరో నెలన్నరలోనే ఎన్నికలు రావడం ఖాయమని నేరుగా అధికార పార్టీ నుంచే సంకేతాలు అందుతున్నాయి. దీంతో అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. నిద్రాణంగా ఉండిపోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీలోనూ కదలిక వచ్చింది. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా వట్టిపోయింది. హైదరాబాద్‌లో మాత్రం ఆశలు మిణుకుమిణుకు మంటున్నాయి. గతంలో మేయర్ పీఠానికి పోటీ కాకకపోయినా…. ప్రధాన ప్రతిపక్షంగా హైదరాబాద్ సిటీలో టీడీపీ ఉండేది. ప్రతీవార్డులోనూ బలమైన క్యాడర్ ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో క్యాడర్ అంతా… టీఆర్ఎస్ వైపు చేరిపోయింది.

కానీ టీఆర్ఎస్‌లో ఇమడలేని.. చొటు దక్కని… దక్కినా ప్రాధాన్యత దక్కదని భావించిన కొంత మంది మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. ఇలాంటి వారితో… టీడీపీ కార్పొరేటర్ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడటం ఖాయమని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీతోనే సాగిందని .. ప్రజలు ఇప్పటికే ఆ అభిమానాన్ని చూపిస్తారని.. టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే.. అనేక డివిజన్లలో సెటిలర్ల ఓట్లే కీలకం కానున్నాయి. వారందరూ.. టీడీపీనే బలపరుస్తారని కూడా నమ్ముతున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న 150 డివిజన్లలో కనీసం అరవై చోట్ల ప్రధాన ప్రత్యర్థిగా టీడీపీ తలపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ ఎంతో కొంత బలం నిరూపించుకుంటేనే… భవిష్యత్ కనబడుతుంది. లేకపోతే.. పూర్తిగా ఉనికి లేని పార్టీగా మిగిలిపోతుంది.

గత బల్దియా ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానం లభించింది. ఆయన కూడాతర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి కూడా సింగిల్ డిజిటే లభించాయి. ఈ సారి పరిస్థితి మారుతుందని.. అంత ఏకపక్షంగా ఉండదని టీడీపీ భావిస్తోంది. అందుకే.. రంగంలోకి దిగాలని నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పేరుతో అందరూ కలిసి పోటీ చేశారు. ఈ సారి అలాంటి ఆలోచనలు లేవు కాబట్టి.. టీడీపీ సొంతంగా రంగంలోకి దిగడానికి ఎలాంటి మొహమాటాలు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు. కానీ.. పోటీ చేసి.. కనీసం ప్రభావం చూపకపోతే.. మొత్తానికే మోసం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close