కేసీఆర్ శ్రీశైలం అడిగితే ఏపీ నాగార్జునసాగర్‌ను అడగలేదా..!?

కాళేశ్వరం ప్రాజెక్ట్ శిలాఫలాకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ హైలెట్ చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రిహోదాలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఆ శిలాఫలకాన్ని .. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేసీఆర్ ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి ఇనాగరేట్ చేసిన ప్రాజెక్టును ఏపీ సర్కార్ అక్రమం అంటోందని.. ఇదెక్కడి న్యాయమని కేసీఆర్ వాదన. ఈ ఒక్కదాన్నే బేస్ చేసుకుని… తెలంగాణలో నిర్మిస్తున్నప్రాజెక్టులన్నీ సక్రమం అని చెప్పడమే కాదు… అంతకు మించి వివాదాలు రాకుండా ఉండాలంటే శ్రీశైలం ప్రాజెక్టును కూడా తమకు అప్పగించడం ఒక్కటే మార్గమన్నట్లుగా కేసీఆర్ లేఖ రాశారు. కేసీఆర్ రాసిన పధ్నాలుగు పేజీల లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది.

అపెక్స్ కౌన్సిల్ భేటీ కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్… అపెక్స్ కౌన్సిల్ భేటీలో వ్యవహరించాల్సిన విధానాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ మేరకు కీలకమైన పాయింట్లతో ముందుగానే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ… జలవనరుల మంత్రి అధ్యక్షతనే జరుగుతుంది. అందకే వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ లేఖను ముందుగానే పంపినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా అక్రమం అని చెబుతోంది. ఆ ప్రాజెక్టుతో పాటు …దానికి అనుబంధంగా… అలాగే.. ఇతర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టులన్నీ సక్రమం అనే వాదిస్తోంది.

కేసీఆర్ రాసిన లేఖకు కౌంటర్‌గా ఏపీ కూడా కేంద్రానికి ఓ లేఖ రాసే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీలు ఖరారయ్యాక ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి అధికారిక సమావేశం నిర్వహించలేదు. సమీక్ష చేయలేదు. అధికారులు మాత్రం తమ కసరత్తు పూర్తి చేశారు. కేంద్రం ముందు అనుసరించాల్సిన విధానంపై ఓ ముసాయిదా సిద్ధం చేశారు. అపెక్స్ భేటీలో అనసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేసిన తరవాత ఓ లేఖను కేంద్రానికి పంపే అవకాశం ఉంది. కేసీఆర్ శ్రీశైలం ప్రాజెక్టును అడిగితే… ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ పై పూర్తి పెత్తనం అడిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఎవరూ తగ్గకుండా జల రాజకీయం చేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌కాష్ రాజ్‌కి సెగ మొద‌లైంది

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని రాజ‌కీయ ఊస‌ర‌వెల్లి అంటూ విమ‌ర్శించాడు ప్ర‌కాష్ రాజ్. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. అందుకే.. ఇలా ఆవేశ ప‌డ్డాడు. అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో...

బాలీవుడ్ లో ‘రేసుగుర్రం’ దౌడు!

ఎందుకో బాలీవుడ్ దృష్టి.. మ‌న పాత తెలుగు సినిమాల‌పై ప‌డింది. మిథునం, ఛ‌త్ర‌ప‌తి, ఊస‌ర‌వెల్లి లాంటి సినిమాల్ని వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్త ఆల‌స్య‌మైనా... మరో హిట్ సినిమా కూడా బాలీవుడ్...

ఎన్నాళ్ల‌కు గుర్తొచ్చావు.. స‌లోనీ!?

స‌లోని... ఈ పేరు విని చాలా కాలం అయ్యింది క‌దా..? రాజ‌మౌళి సినిమాలో హీరోయిన్ గా న‌టించినా.. ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. మ‌ర్యాద రామన్న లాంటి హిట్ చేతిలో ప‌డినా, దాన్ని...

గ్రేటర్ హీట్ : కేసీఆర్ పొలిటికల్..మోదీ అపొలిటికల్..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచారం తారస్థాయికి చేరింది. అవడానికి స్థానిక సంస్థ ఎన్నికే అయినా... ప్రచారంలోకి అగ్రనేతలు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రచారసభలో...

HOT NEWS

[X] Close
[X] Close