రాజధాని భవనాలను పరిశీలించిన వైఎస్ విజయమ్మ..!?

వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ అమరావతి ప్రాంతంలో సీక్రెట్‌గా పర్యటించారు. ఓ ఎస్కార్ట్ వాహనం మాత్రమే వెంట రాగా ప్రత్యేకమైన కారులో ఆమె రాజధానిలో నిర్మించిన రహదారులు, భవనాలను అన్నింటినీ పరిశీలించారు. తాడేపల్లి ఇంటి నుంచి పర్యటన ప్రారంభమైంది. సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ….. పయనించిన అన్ని భవనాలను చూసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పరిశీలన అంతా కారు దిగకుండానే చేశారు. కారులో నుంచే భవనాలను చూశారు. సెక్రటేరియట్ గోడ ముందు ఉన్న రహదారి నుంచి వెళ్తూ …. ఐఏఎస్, ఐపీఎస్‌ల కోసం నిర్మించిన భవనాలతో సహా మొత్తం రాజధాని కట్టడాలను చూసినట్లుగా తెలుస్తోంది.

అమరావతి లో ఏమీ లేదని వైసీపీ చాలా కాలంగా చెబుతూ వస్తోంది. అదే నినాదానికి కట్టుబడి ఉంది. అక్కడ కనిపిస్తున్న భవనాలు అన్నీ తాత్కాలికమైనవేనని వాదిస్తోంది. శాశ్వతభవనాలు నిర్మించలేదన్న కారణంగానే రాజధానిని తరలిస్తున్నామని వైసీపీ మంత్రులు చెబుతూ ఉంటారు. అయితే అక్కడ పదివేల కోట్ల కుపై ప్రజాధనం ఖర్చు పెట్టారని.. 33 వేల ఎకరాలు ఇచ్చిన 29వేల మంది రైతుల త్యాగం ఉందని… టీడీపీ నేతలు చెబుతూ ఉంటారు. అయితే.. వైసీపీ మాత్రం రాజధాని మార్పు అంశంలో ఎలాంటి పునరాలోచన పెట్టుకోలేదు కానీ.. వాటికి గత ప్రభుత్వం పెట్టిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలన్న అంశంపై మాత్రం అనేక రకాల ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గతంలో బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో పర్యటించి.. అమ్మితే ఎంత వస్తాయన్నదానిపై సీఆర్డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పుడు వైఎస్ విజయమ్మ రాజధాని నిర్మాణాలను పరిశీలించడం దేనికో వైసీపీ నేతలకు కూడా క్లూ లెస్‌గానే ఉంది. మామూలుగా అయితే… కారులో నుంచే పరిశీలించారు కాబట్టి.. ఎవరికీ తెలిసే అవకాశం లేదు. వైసీపీ వర్గాలే.. మీడియాకు లీక్ ఇచ్చాయి. విజయమ్మ అమరావతి నిర్మాణాలను పరిశీలించారని చెప్పుకొచ్చాయి. దీంతో అమరావతి విషయంలో వైసీపీ భిన్నమైన ప్రణాళికతో ముందుకెళ్లబోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close