అమరావతిలో ప్రభుత్వ కార్యదర్శులు, మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జగన్ రెడ్డికి చెందిన తాడేపల్లి హెలిప్యాడ్ అంశాన్ని ప్రస్తాించారు. జగన్ ఇంటి పక్కన ఉన్న హెలిప్యాడ్ కోసం భూమిని బలవంతంగా లాక్కున్నారని.. ప్రైవేటు వ్యక్తికి దగ్గర కొనుక్కున్న భూమిని హెలిప్యాడ్ కోసం ఇవ్వనంటే.. బెదిరించారన్నారు. అయినా ఇవ్వకపోతే ఆ భూమిని.. 22-A లో పెట్టార్నారు.
ప్రవేట్ ల్యాండ్ దుర్మార్గంగా లాక్కున్నారు. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి భూమీని ఇల్లీగల్ గా 22-A లో పెట్టాడు . ఇది పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. నాలుగైదు సంవత్సరాలైనా అతని భూమికి విముక్తి కలగలేదని.. మొన్న కలసి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాతనే విషయం తెలిసిందన్నారు. భూములు పై అప్పటి పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అందరూ అలోచించాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రైవేటుల్యాండ్ ను దుర్మార్గంగా.. చట్టాలను అతిక్రమించి అతని నుంచి స్వాధీనం చేసుకోవడానికే 22Aలో పెట్టారని క్లారిటీ రావడంతో ఈ దారుణానికి పాల్పడిన వారిపై విచారణ చేయించే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇందులో నేరుగా అప్పటి సీఎం జగన్ ప్రమేయం ఉన్నట్లుగా తేలితే కేసులు పెట్టే అవకాశాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.
