నోట్లు ముద్రిస్తే దేశం తేరుకుంటుందా..!?

దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వరుసగా రెండో ఏడాది కరోనా దెబ్బకు దేశం అతలాకుతలం అయింది. ప్రజల ఆరోగ్యమే కాదు.. ఆర్థిక ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ప్రభుత్వాలూ చితికిపోయాయి. ఇప్పుడు కేంద్రం కూడా ప్రజల వద్ద నుంచి ఎంత వీలయితే అంత పిండుకోవడానికి ప్రయత్నిస్తోంది. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎడాపెడా పెంచుతోంది. ఈ సమయంలో… కేంద్రానికి.. ఆర్థిక వేత్తల నుంచి ఒక సూచన ప్రధానంగా అందుతోంది. అదే.. కరెన్సీ నోట్లను ముద్రించడం. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంతో పాటు.. పలువురు ఆర్థిక వేత్తలు కొద్ది రోజుల నుంచి ఇదే సలహా ఇస్తున్నారు. తమ సలహాలను పాటిస్తే మెరుగ్గా ఉంటారని.. ఏమీ చేయకుండా కూర్చుండిపోతే విపత్కర పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

నిజానికి ఇప్పుడు ఆర్థిక వేత్తలు నోట్ల ముద్రణ గురించి చెబుతున్నారు కానీ.. గత ఏడాది తొలి లాక్ డౌన్ సమయంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్ మనీ గురించి ప్రస్తావించారు. హెలికాఫ్టర్ మనీ అంటే.. ప్రజలకు నేరుగా పెద్ద ఎత్తున నగదును అందుబాటులోకి తీసుకెళ్లడం. ప్రస్తుతం వైరస్ కారణంగా ప్రజలందరి ఉపాధి దెబ్బతిన్నది. వారికి ఆదాయం లేదు. ఖర్చు పెట్టడానికి వారి వద్ద డబ్బుల్లేవు. మళ్లీ దేశంలో పరిస్థితి ఎప్పుడు గాడిన పడుతుందో తెలియదు. ఈ గండాన్ని గట్టెక్కాలంటే.. ప్రజలకు పెద్ద ఎత్తున నగదు అందాబాటులోకి తేవాలి. లక్షల కోట్లు ప్రజలకు చేరిస్తే మళ్లీ అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి.. ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఆర్థిక వేత్తల అభిప్రాయం.

ఇప్పుడు ఆర్బీఐ వద్ద నిధుల్లేవు. ఉన్న రిజర్వ్ నిధుల్లో .. మరో లక్ష కోట్లు కేంద్రానికి ఇచ్చింది. గత ఏడాది రూ. లక్షా 75వేల కోట్లు ఖజానాకు మళ్లించుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే రిజర్వ్ బ్యాంక్ వద్ద కూడా నిధుల్లేవు. క్వాంటీటేటివ్ ఈజింగ్ పద్దతిలో రాష్ట్రాలకు నిధులకు సమకూర్చాలన్నా… ప్రింట్ చేయడం తప్ప ఆర్బీఐ వద్ద నిధుల్లేవు. రిజర్వ్ బ్యాంక్ మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు, విదేశీ మారక ద్రవ్య నిల్వులు, జీడీపీ లెక్కల ఆధారంగా నగదును ప్రింట్ చేస్తుంది. అయితే.. ఇలా నోట్లు ప్రింట్ చేయడం దేశానికి దీర్ఘ కాలంలో చేటు చేస్తుంది. నోట్లు ప్రింట్ చేసి ప్రజలకు పంచితే.. ప్రజల దగ్గర పేరుకు కరెన్సీ నోట్లు ఉంటాయి తప్పించి వాటికి ఏమాత్రం విలువ ఉండదు. దేశంలో ఉత్పాదకతకు సంబంధం లేకుండా అధికంగా డబ్బులు ప్రింట్ చేస్తే.. అవి చిత్తుకాగితాలతో సమానంగా మారుతాయి. అది దేశ వినాశనానికి దారి తీస్తుంది.

ఆర్థిక వేత్తలు విచ్చలవిడిగా నోట్లు ప్రింట్ చేయాలని చెప్పడంలేదు. దానికో వ్యూహం ఉండాలని అంటున్నారు. కేంద్రం ఏం ఆలోచిస్తుందో కానీ ఇది చాలా సున్నితమైన అంశం. కేంద్రం ఎలా అడుగులేస్తుందనే దానిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close