ప్రజల్ని కాపాడేందుకు నడుంకట్టిన సుప్రీంకోర్టు..!

కరోనా వైరస్ నుంచి ప్రభుత్వాలు ప్రజలను కాపాడుతున్నాయో లేదో కానీ… పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం చేసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా పరిస్థితి వేరేగా ఉంది. ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాక్సినేషన్ దగ్గర్నుంచి బ్లాక్ ఫంగస్ వరకూ…జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా ఉంటున్నాయి. అడ్డదిడ్డమైన నిబంధనలు పెట్టి.. ప్రజల్లో అంతరాలు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సంచలనాత్మక రీతిలో ముందడుగు వేసింది. కరోనా కట్టడి పరిస్థితులను సుమోటోగా తీసుకుని.. విచారణ ప్రారంభించింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తక్షణం కేంద్రానికి నోటీసులు పంపింది. ప్రధానంగా వ్యాక్సిన్ పంపిణీ విధానాన్నితప్పు పట్టింది. కొంత మందికి ఉచితంగా ఇచ్చి.. మిగతా వారిని కొనుక్కోమనడం ఏమిటని ప్రశ్నించింది.

వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు.. అంటే.. ఎన్నెన్ని కొనుగోలు చేశారు.. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రజలు చచ్చిపోతూంటే.. చూస్తూ ఊరుకోలేమని.. వారి రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాల్సి ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అగ్రెసివ్ స్పందన.. ఇప్ుడు… ప్రజల్లో కాస్త ఆశలు నింపుతోంది. దేశంలో వంద కోట్ల జనాభా ఉంటే… నెలకు కనీసం పది కోట్ల మందికీ వ్యాక్సిన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ వేగంతో చేసినా మొత్తం వ్యాక్సినేషన్‌కు ఏడాది పడుతుంది. అయినా కేంద్రం చురుగ్గా స్పందించడం లేదు. వ్యాక్సిన్ విధానంతో ప్రభుత్వాలు.. ప్రజలపై భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు విచారించనుంది.

మరో వైపు సుప్రీంకోర్టు సీరియస్ అవడంతో కేంద్రం వెంటనే .. వ్యాక్సిన్ల విషయంలో స్పందించింది. విదేశీ టీకాల దిగుమతికి ఆటంకాలను తొలగిస్తూ.. అప్పటికప్పుడు ఉత్తర్వులు ఇచ్చింది. ఎఫ్‌డీఏతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన వ్యాక్సిన్లకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదని.. దిగుమతి చేసుకోవచ్చని తాజాగా రిలీఫ్ ఇచ్చింది. అయితే.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రస్తుత పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న కారణంగా ప్రభుత్వం మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

కరోనా ధర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి రెండు విడతల్లో జరిగిన తప్పులు.. మళ్లీ మళ్లీ జరగకుండా ఉంటేనే..భావి పౌరుల్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు.. క్రియాశీలకంగా మారడంతో కేంద్రంలోనూ స్పందన వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close