డీఎస్ విష‌యంలో తెరాస ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేదా..?

గ‌డ‌చిన రెండ్రోజులుగా తెరాస‌లో ఒక ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది! నిజామాబాద్ ఎంపీ సీటును తెరాస కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత‌ను సీనియ‌ర్ నేత ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ కుమారుడు అర‌వింద్ ఓడించారు క‌దా! అయితే, డీ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం భాజ‌పాలో చేర‌లేదు, అలాగ‌ని తెరాస‌లో ఉన్నారా అంటే… సాంకేతికంగా ఉన్న‌ట్టుగానే! తెరాస వ‌ర్గాల్లో ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ ఏంటంటే… డీఎస్ పై పార్టీ ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకుంటుందా అనేది?

ఎన్నిక‌లకు ముందు, డీఎస్ మీద చ‌ర్య‌లు తీసుకోవాలంటూ నిజామాబాద్ తెరాస నేత‌లు తీర్మానించారు. అప్ప‌టి ఎంపీ క‌విత స‌మ‌క్షంలోనే ఈ తీర్మానాన్ని పార్టీ అధినాయ‌కత్వానికి అంద‌జేశారు. అప్పుడే డీఎస్ పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తెరాస నుంచి ఎలాంటి చ‌ర్య‌లు అంటూ లేవు. నిజామాబాద్ జిల్లా తెరాస నేత‌లంతా ఏక‌గ్రీవంగా డీఎస్ మీద ఫిర్యాదు చేసినా, సీఎం కేసీఆర్ చ‌ర్య‌ల‌కు దిగ‌లేదు. ఆ త‌రువాత‌, ఎన్నిక‌లొచ్చాయి. డీఎస్ కుమారుడు అర‌వింద్ భాజ‌పా ఎంపీగా గెలిచారు. రెండ్రోజుల క్రితం జిల్లాలో జ‌రిగిన ఓ స‌భ‌లో డీఎస్ కూడా కుమారుడితో క‌లిసి వేదిక‌ను పంచుకున్నారు. అంతేకాదు, రైతుల‌తో పెట్టుకుంటే ఎవ్వ‌రికైనా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వ్యాఖ్యానించ‌డం విశేషం! అంటే, ప‌రోక్షంగా తెరాస మీదే క‌దా ఆయ‌న పంచ్ వేసిన‌ట్టే.

డీఎస్ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తెరాస అధినాయ‌క‌త్వం ఇప్పుడైనా చ‌ర్య‌లు తీసుకుంటుందా అనే చ‌ర్చ అధికార పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుని ఉన్న డీఎస్ మీద ఛైర్మ‌న్ కి ఫిర్యాదు చేసి, స‌భ్య‌త్వ ర‌ద్దుకి తెరాస ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. అయితే, తెరాస ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగితే… పరోక్షంగా భాజ‌పా నుంచి మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వంపై తెరాస ఫిర్యాదు చేసినా, నిర్ణ‌యం తీసుకోవాల్సింది ఛైర్మ‌న్ క‌దా! ఇంకోటి రాజ్య‌స‌భ‌లో భాజ‌పాకి అనుకూలంగా డీఎస్ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలూ పుష్క‌లంగా ఉన్నాయి. అదే ప‌ని చేస్తే ఆ పార్టీకి మ‌రో నంబ‌ర్ తోడైన‌ట్టే అవుతుంది. ప్రాక్టిక‌ల్ గా ఇలాంటి పరిణామాల‌కు ఆస్కారం ఉంది కాబ‌ట్టి, డీఎస్ విష‌యంలో చూసీ చూడ‌న‌ట్టుగా తెరాస వ్య‌వ‌హ‌రిస్తుందేమో అనే సూచ‌న‌లూ క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు చ‌ర్య‌లంటూ మ‌ళ్లీ చ‌ర్చ పెడితే, తెలంగాణ సీఎం కుమార్తె ఓట‌మిని ప‌రోక్షంగా మ‌రోసారి జాతీయ స్థాయిలో అంద‌రికీ గుర్తుచేసిన‌ట్టు అవుతుంద‌నే అభిప్రాయ‌మూ తెరాసకి చెందిన కొంద‌రు వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. సో.. ప్ర‌స్తుతం తెరాస తీరుపై డీఎస్ నేరుగా విమ‌ర్శించినా కూడా తెరాస నుంచి అనూహ్య చ‌ర్య‌లు ఉండే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌నే వాద‌న కూడా బ‌లంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close