జగన్ కూడా అదే పొరపాటు: పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికే!

గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం కావడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ఆ పార్టీ మీద పడ్డ కుల ముద్ర. ఒక వర్గం వారు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వంలో బాగుపడుతున్నారు అన్న ప్రచారం పార్టీకి తీరని నష్టం కలిగించింది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్, తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని చూసినపుడు, చంద్రబాబు చేసిన ఆ తప్పిదాన్ని పునరావృతం చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు అని, మంత్రివర్గ కూర్పులో చక్కటి సామాజిక న్యాయాన్ని పాటించాడు అని అందరూ భావించారు. కానీ, మంత్రివర్గం తర్వాత చేస్తున్న నియామకాలలో పూర్తిగా రెడ్లకే పదవులు కేటాయించడం చూస్తుంటే చంద్రబాబు మీద పడ్డ ముద్ర జగన్ మీద కూడా చాలా త్వరగానే పడుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అన్ని వర్గాల చేత ఓట్లు వేయించుకున్న జగన్ ప్రభుత్వం మీద ఇలాంటి ముద్ర పడటం జగన్ కి కానీ , ఆ పార్టీ భవిష్యత్తు కి కానీ అంత మంచిది కాదు.

తాజాగా ప్రభుత్వం నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ స‌ల‌హాదారులు:

– జె. విద్యాసాగర్ రెడ్డి
– దేవిరెడ్డి
– కె.రాజశేఖర్ రెడ్డి

ఇక ఇప్పటికే నియమించిన/ ప్రకటించిన కొన్ని నామినేటెడ్ పదవులు ఇవి:

ఏపీఐఐసీ చైర్మ‌న్: రోజా రెడ్డి
సీఆర్డిఎ చైర్మన్: ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి
తుడా చైర్మ‌న్: చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి
టీటీడీ చైర్మ‌న్‌: వైవీ సుబ్బారెడ్డి
ప్రభుత్వ స‌ల‌హాదారుడు: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి
వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మ‌న్‌: ఎంవీఎస్‌ నాగిరెడ్డి
వైద్య ఆరోగ్య శాఖ సంస్క‌ర‌ణ‌ల‌ క‌మిటీ: భూమి రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి
రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్: విజయ సాయి రెడ్డి

చట్ట సభలలో కూడా రెడ్ల కే పదవి ఇచ్చిన జగన్:

పదవుల్లో మాత్రమే కాకుండా, ఇటు చట్టసభలలో కూడా తన సొంత సామాజిక వర్గానికి జగన్ పట్టం కట్టినట్లు అర్థమవుతోంది. ఉదాహరణకు చూస్తే,

పార్లమెంటరీ పార్టీ నేత: విజయసాయి రెడ్డి
లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌: పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
లోక్ సభ లో పార్టీ నేత: మిథున్ రెడ్డి
ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి: విజ‌య‌ సాయి రెడ్డి

ఇంతే కాకుండా:

నామినేటెడ్ పదవులో, పార్లమెంటులో మాత్రమే కాకుండా, సీఎంవో లో కూడా జగన్ ఇదే విధం గా వ్యవహరిస్తున్నారు. ముఖ్య మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి గా ధనుంజయ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ గా కృష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. దీంతో పాటు ఇటీవల మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు అవినీతి పై ఏర్పాటుచేసిన కేబినెట్ స‌బ్ క‌మిటీ లో కూడా అందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కనిపించారు జగన్.

సోషల్ మీడియా వార్:

జగన్ చేస్తున్న ఈ నియామకాల కారణంగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు వీటన్నింటిని ప్రస్తావిస్తూ, మా ప్రభుత్వం మీద అప్పట్లో మీరు అనవసరంగా కుల ముద్ర వేశారు కానీ మా కంటే మీరు మరింత కుల పిచ్చి తో ప్రవర్తిస్తున్నారు అంటూ వైయస్సార్సీపి అభిమానులను రెచ్చగొడుతుంటే, వైఎస్ఆర్సిపి అభిమానులు అంతే దీటుగా స్పందిస్తూ, అక్కడ పదవులు తెచ్చుకున్న వారిలో చాలా మంది ఏళ్ళ తరబడి వైఎస్ఆర్ సీపీకి సేవలందించారని, ఎంతో గడ్డు సమయంలో కూడా జగన్ వెంటే ఉన్నారని, వారి ప్రతిభకు , విధేయత కు జగన్ ఇచ్చిన గుర్తింపు ఈ పదవులన్నీ అని వారు అంటున్నారు. సొంత కులానికి న్యాయం చేయడం మీ ప్రభుత్వంలో ఎక్కువ జరిగిందంటే మీ ప్రభుత్వంలో ఎక్కువ జరిగిందంటూ రెండు పార్టీల అభిమానులు వాదించుకుంటున్నారు.

మొత్తం మీద:

ఏ ఒక్క కులమో ఓట్లు వేస్తే ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ జాలదు. అన్ని కులాల మద్దతు దక్కిన పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా- పార్టీ అధినేతకు చెందిన కులం వారు అదే పార్టీని అభిమానించే జాడ్యం పెచ్చు మీరింది. దీంతో ఏ పార్టీలో చూసినా, పార్టీ కి విధేయత చూపుతూ పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారు ఎక్కువ భాగం ఆ కులానికి చెందిన వారే అవుతూ ఉన్నారు. దీంతో పదవులు కూడా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ కులానికి చెందిన వారికి వస్తూ ఉన్నాయి. కులం ఆధారంగా పార్టీీ లని అభిమానించడం, కులం ఆధారంగా అభ్యర్థులకు, పార్టీలకు ఓటు వేయడం వంటి జాడ్యాల నుండి ప్రజలు బయట పడనంత కాలం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా – ఎన్నికల ముందు సామాజిక న్యాాయం అంటూ వల్లించిన ప్రవచనాలన్ని ఎన్నికల తర్వాత ఇలాా నీటి మూటలు అవుతూనే ఉంటాయి. అయితే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా తమ మీద, తన పార్టీ మీద కుల ముద్ర పడకుండా చూసుకోవడానికి ” కాన్షియస్ గా” ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close