త్రివిక్ర‌మ్ కావాలంటే… రెండేళ్ల‌యినా ఆగాలి

వెంక‌టేష్ మ‌రో రీమేక్‌పై మ‌న‌సు ప‌డ్డాడ‌ని, బాలీవుడ్‌లో విజ‌యం సాధించిన ‘జాలీ ఎల్ ఎల్ బీ 2’ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడిపోతున్నాడ‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. వెంకీ మ‌న‌సుని ప‌సి గ‌ట్టారో ఏమో, త్రివిక్ర‌మ్ కి అత్యంత స‌న్నిహితుడు, నిర్మాత రాధాకృష్ణ (చిన‌బాబు) `జాలీ ఎల్ ఎల్ బీ 2` రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకొన్నారు. దాంతో వెంకీ ఈ సినిమా చేయ‌డానికి మార్గం సుగ‌మం అయ్యింది. అయితే.. ఈ రీమేక్‌కి వెంకీ ఎవ‌రితో ప‌డితే వాళ్లతో చేయ‌డ‌ట‌. త్రివిక్ర‌మ్ తోనే చేస్తాడ‌ట‌. రాధాకృష్ఱ‌కు త్రివిక్ర‌మ్ స‌న్నిహితుడే కాబ‌ట్టి, త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌ని వెంకీ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడు కాబ‌ట్టి వెంకీ – త్రివిక్ర‌మ్ కాంబో సెట్ట‌యిపోవ‌డం ఖాయం అనుకొన్నారంతా. వెంకీ కూడా ఈ సినిమా త్రివిక్ర‌మ్‌కే అప్ప‌గించాల‌ని ఎదురు చూస్తున్నాడు.

అయితే.. త్రివిక్ర‌మ్ అంత ఖాళీగా ఏం లేడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అది అయ్యాక ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమా ఎలా కాద‌న్నా… 9 నెల‌లైనా సెట్స్‌పై ఉంటుంది. ఆ త‌ర‌వాత‌.. మ‌హేష్ బాబు కాచుకొని కూర్చున్నాడు. ఈవ‌న్నీ పూర్త‌య్యేలోగా మ‌ళ్లీ ప‌వ‌న్‌కి మూడ్ రావొచ్చు. కాబ‌ట్టి.. త్రివిక్ర‌మ్ చేతిలో ఉన్న క‌మిట్‌మెంట్స్ పూర్త‌వ్వాలంటే రెండు మూడేళ్ల‌యినా ప‌డుతుంది. అంత వ‌ర‌కూ వెంకీ ఆగుతాడా అనేది పెద్ద ప్ర‌శ్న‌. ద‌ర్శ‌కుడెవ‌రైనా ఫ‌ర్వాలేదు అని వెంకీ అనుకొంటే.. ఈసినిమా వెంక‌టేష్‌తోనే ప‌ట్టాలెక్కేస్తుంది. కాదూ.. కూడ‌దు.. నాకు త్రివిక్ర‌మే కావాలి అని వెంకీ అంటే గ‌నుక‌.. మూడేళ్లు ఆగాలి. లేదంటే.. రాధాకృష్ణ‌నే మ‌రో హీరోని చూసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.