జీతాల పెంపు కోసం వాలంటీర్లు సమ్మె చేస్తారా..!?

ఇంటింటికి రేషన్ పంపిణీ పథకంలో తొలి రెండు రోజులకే డ్రైవర్లు ఎదురు తిరగడంతో వారికి రూ. ఐదు వేల జీతాన్ని పెంచింది ఏపీ సర్కార్. అప్పటి వరకూ నెలకు రూ. పదహారు వేలు ఇస్తామని ఒప్పందం చేసుకుంది. కానీ డ్రైవర్లు ఒక్క రోజుకే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలన్నీ పక్కన పెట్టేయడంతో…. ఎక్స్‌ట్రా మరో రూ. ఐదు వేలు ఇస్తామని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది వారిని సంతృప్తి పరిచిందో లేదో కానీ… ఆ పెంపు ఇతరుల కడుపు మండిపోయేలా చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేసేలా చేస్తోంది. వారే రేషన్ డీలర్లు.. వాలంటీర్లు.

రేషన్ డీలర్ వ్యవస్థకు గండం వచ్చింది. అయితే వారికీ సంతృప్తినిచ్చేలా… స్టాకిస్టులుగా ఉంటే రూ. ఏడు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దాంతో చాలా మంది డీలర్లు అలా ఉండిపోయారు. ఉదయం రేషన్ వాహనాల డ్రైవర్లకు బియ్యం, ఈపోస్ మిషన్లు ఇవ్వడం వారి విధి. సాయంత్రం వారి వద్ద నుంచి మినిగిలిన బియ్యం, ఈ పోస్ వాహనాలు, నగదు కలెక్ట్ చేసుకోవడం డీలర్ల పని. వారు ఇప్పుడు రగిలిపోతున్నారు. తమ దగ్గరకు వచ్చి లబ్దిదారులు బియ్యం తీసుకుపోతే.. వారికి కమిషన్ వచ్చేది. ఇప్పుడు ఆ కమిషన్ రాకపోగా.,.. ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్నందుకు ఏకంగా ఇరవై ఒక్క వేలు ప్రభుత్వం ఇస్తోంది. పైగా… వాహనాల సబ్సిడీని రూ. రెండు లక్షల వరకూ భరిస్తోంది. పావలాతో పోయేదాన్ని పది రూపాయలుఖర్చు పెట్టడమే కాకుండా..తమ ఆదాయాన్ని తగ్గించేశారని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఇలా రేషన్ డ్రైవర్లు ఇలా ఆందోళన చేసి.. అలా జీతం పెంచుకోవడంతో వాలంటీర్లకు కడుపు మండిపోయింది. ఏడాదిన్నర నుంచి ఐదు వేలకు గొడ్డు చాకిరీ చేస్తూంటే తమ గురించి పట్టించుకోకుండా.. వారు అడిగిన వెంటనే ఐదు వేలు పెంచడం ఏమిటని వారంటున్నారు. బియ్యం పంపిణీలో కూడా వాలంటీర్ల పాత్ర ఉంది. తమతో అన్ని పనులు చేయించుకుంటారని మండిపడుతున్నారు. వీరి అసంతృప్తి ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎప్పుడో ఏడాది కిందటే… వాలంటీర్ల జీతాలను రూ. ఎనిమిదివేలు చేస్తామని ప్రభుత్వం లీక్ ఇచ్చింది. కానీ చేయలేదు. ఇప్పుడు… వాలంటీర్లు ఉద్యమ బాట పడుతున్నారు. అవసరమైతే విధులు బహిష్కరించి సమ్మె చేస్తామంటున్నారు. తొంభై శాతం వాలంటీర్లు తమ పార్టీ వారేనని విజయసాయిరెడ్డిలాంటి వారు చెప్పుకున్నా…వారు ఎంత కాలం అనిఐదు వేలకు చేస్తారన్న చర్చ నడుస్తోంది.

ఇప్పుడు రేషన్ డీలర్లు, వాలంటీర్లు మాత్రమే కాదు.. ఇతర వర్గాలు కూడా జీతాల పెంపు కోసం ఉద్యమించే బాటలో ఉన్నాయి. ఒకరికి పెంచి.. మరొకరికి పెంచకపోతే.. వారికి కోపం రాక మానదు. ఆందోళనకు దిగితేనే ప్రభుత్వం స్పందిస్తోందన్న అభిప్రాయం వచ్చింది కాబట్టి.. ఇక అందరూ రంగంలోకి దిగితే.. ప్రభుత్వానికి ఉక్కపోతే తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close