విశాఖకు ప్రపంచ చాంపియన్ సాధించిన టీమ్ రాబోతోంది. ఈ నెలలోనే వారు వస్తున్నారు. అంటే వచ్చే రెండు వారాల్లో ఆ చాంపియన్లు వస్తున్నారు. వారు ఎవరు ఎవరో గేస్ చేయండి అని నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. గతంలో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సందర్భంగా నారా లోకేష్ ఇలాంటి టీజర్ ట్వీట్లు చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రపంచ చాంపియన్లు విశాఖ రాబోతున్నారని.. ఎవరో గేస్ చేయాలని ట్వీట్ చేశారు.
అయితే నారా లోకేష్ క్విజ్ ను చాలా మంది సులువుగా గుర్తించారు. మహిళా ప్రపంచకప్ సాధించిన టీమ్ రాబోతోందని చెబుతున్నారు. ఎందుకు రాబోతుందో కూడా కొంత మంది షెడ్యూల్ ప్రకటించారు. విశాఖ స్టేడియంలో ఇండియా, శ్రీలంక మహిళా జట్ల మధ్య రెండు టీ ట్వంటీ మ్యాచులు జరగనున్నాయి. ఈ నెల 21, 23న ఈ రెండు మ్యాచులు జరుగుతాయి. ఇందు కోసం హార్మన్ ప్రీత్ బృందం విశాఖకు వస్తుంది. బహుశా నారా లోకేష్ చేసిన ట్వీట్ ఈ మ్యాచ్ల గురించేనని ఎక్కువ మంది చెబుతున్నారు.
కొంత మంది నెటిజన్లు మాత్రం.. మెస్సి తరహాలో ఎవరైనా వస్తున్నారా అని ఆరా తీస్తున్నారు. అయితే అలాంటి ప్రణాళికలేమీ లేవని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మెస్సీ తెలంగాణకు రావడానికి ముందే మరో ఫుట్ బాల్ స్టార్ బెక్ హామ్.. విశాఖలో పర్యటించారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఫుట్ బాల్ కిటుకులు నేర్పించారు.
