డేంజర్‌లో ప్రపంచం… చైనా ప్రశాంతం..!

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో పాటు.. అనేక వేరియంట్లు ఇప్పుడు ప్రపంచ ప్రజల మీద దాడి చేస్తున్నాయి. దేశాలన్నీ లాక్ డౌన్‌లు పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపే పరిస్థితి మళ్లీ వచ్చింది. అయితే అనూహ్యంగా చైనా నుంచి మాత్రం.. ఆ దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతోందని కొత్త కొత్త కథనాలు వస్తున్నాయి. అక్కడ కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఎవరూ చెప్పడం లేదు. ఆర్థిక వృద్ది గురించి మాత్రం బాకా ఊదేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే.. ప్రస్తుతం చైనాలో కరోనా ప్రభావం లేదని అనుకోవాలి. వైరస్‌ను పుట్టించి ప్రపంచం మీదకు వదిలేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాపై సెకండ్ వేవ్ ప్రభావం ఏమీ లేనట్లుగానే తెలుస్తోంది.

చైనాలో ఏం జరిగినా బయటకు రావాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతితోనే రావాల్సి ఉంటుంది. తమ దేశంలో జరిగే కరోనా మరణాల గురించి చైనా ఇప్పటికే సీక్రెసీ మెయిన్‌టెయిన్ చేస్తోంది. కరోనా కేసులు ఎన్ని వస్తున్నాయో చెప్పడం లేదు. కరోనా వెలుగు చూసిన మొదట్లో.. చైనా ఇలా నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి దిగజారిపోయింది.ప్రపంచం కష్టాల్లో పడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం చైనాలో ఎంత ఉందనేదాన్ని కూడా అంతే సీక్రెట్‌గా ఉంచుతున్నారు. అదే సమయంలో తమపై ఏ ప్రభావమూ లేదన్నట్లుగా… అభివృద్ధి నివేదికలు వెల్లడిస్తున్నారు.

ఇటీవల కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు క్లీన్ చిట్ ఇచ్చింది. వుహాన్ లేబరేటరీ నుంచి కరోనా వైరస్ లీకవలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. కానీ దీన్ని ఎవరూ నమ్మడం లేదు. ఖచ్చితంగా వైరస్ చైనాలోని వుహాన్ లో కరోనా వ్యాప్తి ప్రారంభమై ఉంటుందని అంటున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ప్రపంచం మొత్తం ముప్పులో ఉంది.. కానీ అసలు సమస్య ప్రారంభానికి కారణం అయిన చైనా మాత్రం ప్రశాంతంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close