హమ్మ.. బండి సంజయ్‌నే లైట్ తీసుకుంటారా..!?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కోపం వచ్చింది. ఇతర పార్టీల మీద… ఇతర పార్టీల నేతల మీద కోపం రావడం సహజమే… కానీ.. ఆయనకు కోపం వచ్చింది మాత్రం సొంత పార్టీ నేతల మీద. అలా ఇలా కాదు.. చర్యలు తీసుకుంటానని ఊగిపోతున్నారు. ఎందుకంటే.. తనకు చెప్పకుండా బీజేపీ నేతలు వెళ్లి కేటీఆర్‌ను కలిశారట. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేటీఆర్‌ను కలవడం ఏమిటనేది ఆయనప్రధాన అభ్యంతరం. అలా కలిసింది గ్రేటర్ బీజేపీ నేతలు. అదీ కూడా బీజేపీకి మేలు చేయమని కోరేందుకే వెళ్లారు. అయితే ఇది బండి సంజయ్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు.

గ్రేటర్‌లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం చేయక ముందే చనిపోయారు. దాతో ఉపఎన్నిక అనివార్యం అయింది. గెలిచిన బీజేపీ కార్పొరేటర్ కుటుంసభ్యుడ్ని ఏకగ్రీవంగా గెలిపించాలని ఆ నియోజకవర్గం బీజేపీ నేతలంతా అపాయింట్‌మెంట్ తీసుకుని కేటీఆర్‌ను కలిశారు . కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించి లింగోజీ గూడ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ నేతల పని ఫలవంతమైంది. కానీ బండి సంజయ్‌కు ఇది నచ్చలేదు. అది బీజేపీ సిట్టింగ్ సీటు అని.. భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న చోట.. ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ వద్దకు వెళ్లడం ఎందుకుని..పైగా తన అనుమతి తీసుకోకకపోవడం ఏమిటని ఆయన ఫైరవుతున్నారు.

లింగోజిగూడ నుంచి టీఆర్ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అయినప్పటికీ అక్కడ ఏకగ్రీవం అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అనుచరుడు నామినేషన్ వేస్తున్నారు. మరికొంత మంది కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితి చూసి.. టీఆర్ఎస్ నేతలు కూడా.. కేటీఆర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏకగ్రీవం అయ్యే చాన్స్ లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ప్రకటించి… అభ్యర్థిని దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close