ఆ సినిమా ఒప్పుకుని చ‌ర‌ణ్ త‌ప్పు చేశాడా?

రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే… అభిమానులు ఎగిరి గంతేశారు. ఎందుకంటే.. చిరంజీవికి ఎప్ప‌టి నుంచో శంక‌ర్ తో ఓ సినిమా చేయాల‌న్న‌ది కోరిక‌. అది తీర‌లేదు. మ‌ధ్య‌లో ఓసారి ఛాన్స్ వ‌స్తే.. కుద‌ర్లేదు. భ‌విష్య‌త్తులో ఈ కాంబో సెట్ట‌య్యేఅవ‌కాశాలు కూడా లేవు. అందుకే… చ‌ర‌ణ్ తో అయినా శంక‌ర్ సినిమా చేస్తున్నాడ‌ని సంతోషించారు.

అయితే ఇప్పుడు ఆ ఫ్యాన్సే.. చ‌ర‌ణ్ ఈ సినిమా ఒప్పుకుని త‌ప్పు చేశాడా? అంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. శంక‌ర్ ప‌రిస్థితి అలా వుంది మ‌రి. వ‌రుస‌గా కోర్టు గొడ‌వ‌లు. నిర్మాత‌ల‌తో త‌గాదాలతో శంక‌ర్ త‌ల్ల‌డిల్లుతున్నాడు. భార‌తీయుడు 2 పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమా చేయ‌కూడ‌ద‌ని లైకా మోకాలు అడ్డుతోంది. శంక‌ర్ కూడా `భార‌తీయుడు 2 పూర్తి చేసే తీర‌తాను` అంటున్నాడు. శంక‌ర్ కి మ‌రో మార్గం కూడా లేదు. జూన్ – జులై నుంచి ఈ సినిమా పునః ప్రారంభం అవ్వొచ్చు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కే శంక‌ర్ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు పూర్త‌వుతుందో.. త‌న‌కు కూడా తెలీదు. ఎందుకంటే టెక్నిక‌ల్ రీజ‌న్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. నిర్మాత‌లు ఇప్ప‌టికే ఈ సినిమాకి కేటాయించాల్సిందంతా కేటాయించేశారు. అద‌నంగా ఒక్క పైసా కూడా ఇవ్వ‌రు. నిర్మాత‌ల‌తో శంక‌ర్ కి స‌ఖ్య‌త లేదు. కాబ‌ట్టి.. ఈ సినిమా అలా వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తూనే ఉంటుంది. ఇది ఎప్పుడు పూర్త‌వుతుంది? చ‌ర‌ణ్ తో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది?

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత‌… చ‌ర‌ణ్ శంక‌ర్ కే క‌మిట్ అయ్యాడు. క‌నీసం ఈ యేడాది చివ‌ర్లో అయినా ఈ ప్రాజెక్టు మొద‌ల‌వుతుంద‌న్న‌ది చ‌ర‌ణ్ ఆశ‌. కానీ.. ఆ ల‌క్ష‌ణాలేం క‌నిపించ‌డం లేదు. చ‌ర‌ణ్ సినిమా మొద‌లెట్టినా.. మధ్య‌లో ఎన్ని అవాంత‌రాలు వ‌స్తాయో? ఎందుకైనా మంచిది.. చ‌ర‌ణ్ మ‌రో ఆప్ష‌న్ కూడా పెట్టుకుంటే మంచిదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close