‘శ్రీమంతుడు’ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

ప్రిన్స్ మహేష్ బాబు, శృతి హాస్సన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా ఊహించినట్లే మొదటి రోజు నుండే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న విడుదలయిన మొట్టమొదటి రోజే ఏకంగా రూ.30 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా విజయవంతం అయిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, “ఈ సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నాను. ఈ సినిమాని చూసినవారెవరూ కూడా దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయలేదు. అందరూ చాలా మెచ్చుకొంటున్నారు. మేము ఈ సినిమా తీస్తునప్పుడే తప్పకుండా హిట్ అవుతుందని అనుకొన్నాము కానీ ఇంత హిట్ టాక్ వస్తుందని ఆశించలేదు. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తున్న తీరు చూసి ఇన్ని రోజులుగా మేమందరం పడిన కష్టానికి తగిన గుర్తింపు, ఫలం దక్కిందని మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, ఈ సినిమా విజయానికి కారకులయిన ప్రజలకి అందరికీ కూడా మా చిత్ర యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా విజయానికి మూలకారకుడయిన మహేష్ బాబుగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,’ అని అన్నారు.

ఈ సినిమా నిర్మాతలలో ఒకరయిన నవీన్ ఎర్నేని ఈ సందర్భంగా మాట్లాడుతూ” మా బ్యానర్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. మొదటిసినిమాయే ఇంతగొప్ప విజయం అందించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు కొరటాల గారికి, హీరో, హీరోయిన్లు మహేష్ బాబు, శ్రుతీ హాస్సన్ అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఈ సినిమా విజయానికి కారకులయిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా మేము కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. అందరికీ మా మనవి ఏమిటంటే దయచేసి పైరసీని ప్రోత్సహించవచ్చు. వీలయితే అటువంటి వారి గురించి మాకు సమాచారం అందించి మన అభిమాన హీరో సినిమా విజయవంతం అయ్యేందుకు అందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాను, అని అన్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి రవిశంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా కలెక్షన్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి: నైజాం: రూ.5.60 కోట్లు, సీడెడ్: రూ.2.90 కోట్లు, కృష్ణా: రూ.1.20 కోట్లు, గుంటూరు: రూ.2.05 కోట్లు, నెల్లూరు: రూ.0.60 కోట్లు, తూర్పు గోదావరి: రూ.1.71 కోట్లు, పశ్చిమ గోదావరి: రూ.1.90 కోట్లు, వైజాగ్: రూ.1.05 కోట్లు, కర్ణాటక: రూ.2.02 కోట్లు, తమిళనాడు: రూ.0.56 కోట్లు, ముంబై: రూ.0.92 కోట్లు, యు.యస్: రూ.8.55 కోట్లు, ఓవర్ సీస్: రూ.1.08 కోట్లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close