రాష్ట్రానికి హోదా బాధ , నాయకులకు పదవులే హోదా !

స్వాతంత్ర్యానంతరం నాటి తరం నాయకులు రాష్ట్రం కోసం, దేశం కోసం ముఖ్యంగా ప్రజాసమస్యల పరిష్కారం వైపు నిలబడితే నేటి వర్తమాన రాజకీయాలలో నాయకులు ప్రజల సమస్యలు తీర్చకుండా వారి సమస్యలు తీర్చుకోవటం దిగజారిన రాజకీయ విలువలకు పరాకాష్ఠ. నాయకులు వారి వ్యక్తిగత సమస్యలు తీర్చుకుని తదుపరి అయినా ప్రజల సమస్యలు తీరిస్తే చాలని ప్రజలు కూడా అవగాహనకొచ్చారు.కానీ జరుగుతున్నది ఏమిటి? …

రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రం, రెండు రాష్ట్రాలుగా అవటానికి తలా ఒక చేయివేసిన అన్ని రాజకీయ పక్షాలు (ఈ విషయంలో సి.పి.యం మినహాయింపు) ఈనాడు ప్రత్యేక హోదా కోసం తలా ఒక చేయి వేయకపోవటం దారుణం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మిత్రధర్మంతో బిజెపి పట్ల మెతక వైఖరితో ప్రత్యేక హోదా కోసం వత్తిడి చేయకుండా వదిలేయటం రాష్ట్రానికి శరాఘాతం వంటిదే   [pullquote position=”right”]నేటి ప్రభుత్వంలోని అధికారం అనుభవిస్తున్న మంత్రులు,శాసనసభ్యులు,కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు ఇంకా తామేదో ప్రతిపక్షంలో ఉన్నట్టు “ప్రయత్నిస్తాం…తెస్తాం” అని 15 నెలలుగా చెబుతున్నారు. కానీ తమ కల్లబొల్లి కబుర్లతో వారు ప్రజల్ని ఏమార్చలేరు. వీరి ప్రయత్నలోపాలను ప్రజలు గమనిస్తున్నారు.[/pullquote] ఇప్పటికైనా ఈ అలవాటుని మానుకుని ఆంధ్రకు ప్రత్యేక హోదా తేవటానికి అవసరం ఐతే కేంద్రం మీద అలిగి మంత్రులను వెనక్కు పిలిపించుకొని, సామ,దాన,బేధ, దండోపాయాలతో లేక చాణక్యుని యుక్తులతో ముందుకివెళ్ళి ప్రత్యేకహోదా సాధించాలి.

రాజ్యసభ సభ్యులకు కేంద్రమంత్రి పదవులు, శాసనమండలి సభ్యులకు రాష్ట్రమంత్రివర్గంలో భాగం కల్పించటం నాడు పెద్ద సభలు పెట్టిన నాటి పరిస్థితుల్ని ఈనాడు అవి ప్రశ్నార్థకంగా మార్చాయి. వీరికి ప్రజలతో సాన్నిహిత్యం, ప్రజా అవసరాలు పరిష్కరించటంలో అనుభవము లేక తికమకగా ఉన్నారేమో అనుకోవాలి. వీరు రాజ్యం లేని రాజులు, వీరికి ప్రజల అభీష్టంతో అవసరం లేదు. ప్రజల అవసరాలు ప్రత్యక్షంగా తెలియవు. ప్రజల కోసం పనిచేయకపోతే మళ్ళీ చట్ట సభలకు ఎన్నికవటం, ఎన్నిక కాకపోవటం. ఫ్రత్యక్ష ఎన్నికలతో పని లేదు కాబట్టి వారు ప్రత్యేక హోదా గానీ మరి ఏ ఇతర ప్రజా సమస్యలను పరిష్కరించక పోగా పార్టీల వైపు, వారి వారి కుల సమీకరణలను బట్టి ఒక కేంద్రమంత్రి ప్రజలతో ప్రత్యేక హోదా రాదు. రాకపోయినా వేరే ప్యాకేజీ ఇస్తాం, తెస్తాం…ప్రయత్నిస్తాం అని చెబుతూ వారి పార్టీలకు ప్రయోజనం ఉండేలా వ్యవహరించటం మనం చుస్తున్నాం.నాడు రాష్ట్రాన్ని విభజించినపుడు, విభజన చట్టం రూపూదించటంలో కీలక పాత్ర పోషించిన మంత్రి జైరాం రమేష్, హోదా కావాలని 10 నుంచి 15 సంవత్సరాలు యివ్వాలని నానాయాగీ చేసిన వెంకయ్యనాయుడు ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. నాడు,నేడు ఈ ప్రకటనలు చేస్తున్నది అందరూ రాజ్యసభ సభ్యులే. ఈనాడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ ప్రకటనలిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రజాస్పందన తెలుసుకోవాలని అన్ని పార్టీలు కావాలనే రాజ్యసభ సభ్యుల్నీ,  రాష్ట్రంలో శాసనమండలి సభ్యుల్ని (ఆంధ్రలో నారాయణ) వాడుతున్నారని అనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు మంత్రులే కీలకమనేది జగమెరిగిన సత్యం. ఒకరు కేంద్రమంత్రి సుజనాచౌదరి, మరొకరు రాష్ట్ర మంత్రి నారాయణ. దాదాపు కేంద్రంలో ఆ అమాత్యుడు, రాష్ట్రంలో ఈ అమాత్యుడు అత్యంత అనుభవలేమితో మంత్రులై ప్రత్యక్షంగా ఎన్నిక కాని వీరు ప్రజల అవసరాలు తీర్చకుండా వారి పార్టీల వైపు వుండి, ప్రజల కూడా ఆయా పార్టీల వైపు కార్యకర్తలుగా మాట్లాడటం అవివేకం, అర్థరహితం. ప్రభుత్వ పదవీకాలం 60 మాసాల్లో దాదాపు నాలుగవ వంతు 15 మాసాలు కాలం గడిచిపోయింది. యింకా అధికార పార్టీ నాయకులు పూటకో మాట, కేంద్రమంత్రులు, ఒకో మంత్రి ఒకో రకంగా మాట్లాడటం చుస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు తలా ఒకొటి చెబుతున్నారు ఇది సరికాదని ప్రభుత్వాన్ని తప్పుపట్టకపోతే ఇది మారే పరిస్థితి కనిపించటంలేదు. కోర్టు ప్రభుత్వాధినేతలకు మరియు పార్లమెంటు చేసిన చట్టాల విషయంలో వారిచ్చే ప్రకటనలు,ప్రతిపాదనలు సభ ముందు మాట్లాడే విషయాలను తు.చ. తప్పకుండా అమలు అయ్యెటట్లు చూడాల్సిన బాధ్యత కనిపిస్తుంది. లేకపోతే వారు బహిరంగ సభల్లో లాగే చట్ట సభల్లో మాట్లాడటం అవి అమలు కానప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ప్రజలు అపనమ్మకం ఏర్పరుచుకొనే అవకాశం చాలా తొందర్లోనే ఉన్నట్లగుపిస్తుంది.

[pullquote position=”left”]నాటి భారతప్రధాని మన్మోహన్ మాటలకు రాజ్యసభలో ఇచ్చిన హామీలకు,నేటి ప్రధాని మోదీ విలువివ్వకపోవటం పార్లమెంటు చేసే చట్టాలకు శాస్ర్తీయత ఉందా అనిపిస్తుంది.[/pullquote] అసలు ఈ వ్యవహారాలన్నిటికీ ప్రధాన సమస్య పార్టీలన్నీ సాంప్రదాయాలకు తిలోదకాలివ్వడటం అనిపిస్తుంది. నాటి జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు తదుపరి భాజపాకి రాష్ట్ర అధ్యక్షుడు అయిన యతి, ప్రాసల వెంకయ్యనాయుడు గారు ప్రజలకు తన వాగ్ధాటితో వినోదాన్ని పంచుతున్నారే గాని నాడు రాజ్యసభలో కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని విభజన బిల్లుకు ప్రతిపాదనలు చేసి, నేడు కేంద్రప్రభుత్వంలో మంత్రిగా మౌనం వహించటం బాధ్యతారాహిత్యం, విధి వైచిత్రం అనుకోవాలో మరే మనుకోవాలో! గాని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టి, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా నాడు చేసిన చట్టాన్ని, హోదాని నిస్సహాయంగా అడుగుతూనే ఉన్నది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీకాలం చివరిలో ఆఖరి సంవత్సరంలో రాష్ట్రాన్ని విడగొట్టింది. అది కాంగ్రెస్ చేసిన తప్పని నినదించిన జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 15 మాసాలైనా ప్రత్యేక హోదా తేల్చమనక పోవటం సిగ్గుచేటు. ఆంధ్రవిశ్వవిద్యాలయ పూర్వ విధ్యార్థి, నమ్ముకున్న పార్టీలో నాలుగు దశాబ్ధాలుగా ఉన్న నైతిక విలువలున్న నాయకుడు,అలుపెరగని ప్రయాణం, విరామ మెరుగని జీవితం గడిపిన వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రానికి మంచిచేస్తారని మన రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. కారణం వారు విభజన బిల్లు సమయంలో హోదా మరి ఏ ఇతర అంశాలు ప్రతిపాదించి గట్టిగా నాడు మట్లాడటం వల్లనే! కానీ ఈనాడు ఆయన ఈ హోదా విషయంలో ఏమీ చేయకుండా ఉండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈయన దాదాపు మూడున్నర దశాబ్దాలు ప్రతిపక్షనాయకుడిగా ఉన్నాడు. ఈయన ప్రతిపక్షానికే నాయకుడు…పరిపాలనకు కాదని ప్రజలు భావించేపరిస్థితి ఏర్పడింది.అది ఆయనకు అవమానకరం. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనే నిజాన్ని విస్మరించి ప్రభుత్వ పెద్దలు విదేశాలలో విహరించి పెట్టుబడులు ఆకర్షిస్తాం అని చెబుతున్నారు. విదేశీ పారిశ్రామిక వేత్తలు కూడా వ్యాపారులే కదా. వారైనా ప్రత్యేక హోదా ఉంటే వచ్చే రాయితీ వల్ల మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.

గడిచిన జులై మాసంలో తానా అనీ, నాట్స్ అనీ తెలుగు సంఘాల సభలు, సమావేశాలకు అతిధులుగా,ఆత్మీయ అతిధులుగా ముఖ్య అతిధులుగా హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు,శాసనసభ సభ్యులు అమెరికా ప్రయణానికి 2 రోజులు, సభలు సమావేశాలకు 5 రోజులు వీళ్ళు వెచ్చించిన వారం సమయంలో వీరు సగం రోజులైనా ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని ఒత్తిడి చేస్తే ప్రయత్నిస్తే కేంద్రం తప్పని సరిగా దిగివచ్చేదేమో? మీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సమావేశాలకు సింగపూర్, లండన్, మలేషియా, ఆస్ట్రేలియా మరీ ముఖ్యంగా అమెరికా వచ్చి వెళ్ళిన అన్ని పార్టీల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఆంధ్ర ప్రజల కోసం వారికి ఈ పదవుల హోదా ఇచ్చిన ప్రజల కోసం రాష్ట్రంకి హోదా ఇవ్వమని అడగటం కోసం ఒక్క వారం అయినా ఢిల్లీ వెళ్ళి వారి మెడలు వంచితే బాగుండేది. ముందు ఆ పని చేయకుండా ఉపాధి కోసం విదేశాలకు వచ్చిన ప్రవాసాంధ్రుల దగ్గరకు రావటం విచారకరం. వారిపై నమ్మకంతోనే ప్రజలు వారికి రాజ్యాధికారం కట్టబెట్టారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని సరిదిద్ది, రాజధానిని నిర్మించి, ప్రత్యేక హోదా తెచ్చిపెట్టి ఆంధ్రాను గాడిలో పెట్టమంటే వారు ఆ సమస్యలను తీర్చకుండా విదేశాల్లో ఊరేగడం క్షమార్హం కాదు.

పన్నెండేళ్ళకోసారి వచ్చే పుష్కరాలకు ఇచ్చిన శ్రద్ధ (పుష్కరాలకు ప్రజలు వచ్చేది భక్తితో) ప్రజలు భుక్తికి సంబందించిన హోదా అంశానికి ఇచ్చి, రాజమండ్రిలో మకాం వేసినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మకాం వేస్తే మోడీ దిగిరాడా? మనపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విభజన బిల్లులో ఇలాంటివి ఏమన్నా అతనికి పెడితే అతను కేంద్రానికి దిగివచ్చేటట్లు ఉద్యమం బాట పట్టి ఈపాటికే తెచ్చుకొనేవాడనే భావన ఆంద్రులలో ఉంది. కె.సి.ఆర్ విభజన బిల్లులోని అంశాల కోసం పోరాడుతున్నాడు. మనం మాత్రం విభజన చట్టంలోని అంశాల కోసం పోరాడటంలేదు. హైకోర్టు విషయంలో వారి ప్రయత్నాలను మనం చూస్తున్నాం. ఓటుకో నోటు వ్యవహారంలో ప్రభుత్వం పెట్టిన ప్రయత్నాలు పెడితే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చి ఉండేది. తెలంగాణాలో పార్టీని కాపాడుకోవడానికి టి.టి.డి లో ఎ.పి.హౌసింగ్ కార్పోరేషన్ లో తెలంగాణా వారిని నియమించటంలాంటి శ్రద్ధ ఆంధ్రకు హోదా విషయంలో కూడా తీసుకుంటే బాగుంటుంది.

ప్రజలు ఏమి కోరుకుంటున్నారనే విషయంలో పార్టీలకు స్పష్టత లేదేమో? ఎలాగూ పార్టీలు ఒక చట్రంలో ఉండలేవు…అలాగే ప్రజలు కూడా వారికి కావాల్సింది…అందరికీ ఉపయుక్తమైనది కావాలనే ధోరణిలో కాక పార్టీల కార్యకర్తల్లా మారటం వల్ల చివరికి నష్టపోయేది వారే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరియు జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అనే నిజాన్ని విస్మరించి ప్రజల్లో కొంతమంది వారిద్దరిని అలా గుర్తించనట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఎటు పోతున్నామో అర్ధం కాని పరిస్థితి.

ఎ.పి.  ఎన్జీవోలు ,విద్యార్దులు నాడు సమైక్యాంద్రోద్యమంలొ పాల్గొన్నారు. నేడు ఉద్యోగులు గాని, విద్యార్దులుగాని ప్రత్యేక హోదా కావాలని అడగటంలేదు.నాడు భావోద్వేగాల సమయంలో జీతం రాదని తెలిసి 58 రోజులు ఉద్యోగాలు విధులకు దూరంగా ఉన్నారు.నాటి ఉద్యమ నేపద్యంలో అశోక్ బాబు ఒక్క వారంలోనే ప్రముఖ వ్యక్తిగా మారిన పరిస్థితి.[pullquote position=”left”]నేడు అశోక్ బాబు నోరెందుకు మెదపటంలేదు? కారణం ఏమిటి? అని ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. [/pullquote] ఎన్నికల ప్రచార సభల్లో మోడీ ప్రత్యేక హోదా ఇస్తామని బలంగా చెప్పాడు. ఇప్పుడు అదే మోడీ ఆ ఊసు కూడా ఎక్కడా ఎప్పుడూ ఎత్తటంలేదు. మోడీతో కలిసి మరియు విడిగా చాలా సభల్లొ జనసేన నేత పవన్ కళ్యాణ్ గళమెత్తి అరిచాడు.  [pullquote position=”right”]గళమెత్తి అరిచి ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఒకట్రెండు ప్రెస్ మీట్లతో చేతులెత్తేశాడు. తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులని ప్రశ్నించాడు. కలవాల్సిన మోడీని జనసేన అద్యక్షుడు కలవనేలేదు..హోదా ఇమ్మని అడగనూలేదు. ప్రశ్నించాల్సిన మోడీని ప్రశ్నించనూలేదు! [/pullquote]ఏదో ఒక మంచి ఉద్ధేశ్యంతొ ఇద్దరు శివాజీలు ప్రశ్నిస్తాం ,జనాన్ని జాగృతం చేద్దామని ప్రయత్నిస్తుంటే ఒక శివాజి సినిమాలు లేక ఖాళీగా వుండి ఇది చేస్తన్నాడని, మరో శివాజి కుల సంఘంలో ఉనికిని కొల్పోయి ఇది చేస్తున్నాడని అక్షరాస్యులైన మేధావులు కూడా విమర్శించటం బాధాకర పరిణామం. సమస్యను సమస్యగా, తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా, ఉన్నది ఉన్నట్లు , సద్విమర్శ స్వీకరించేటట్లు, తప్పని తప్పుగా ఖండించకుండా పార్టీల రంగుటద్దాలు పెట్టుకొని ఆయా పార్టీల కార్యకర్తల్లా మేధావులు కూడా తయారైతే అది విజ్ఞతా? వీరినే మనం విజ్ఞాన ఖనులనుకోవాలా? గతంలో తప్పుచేస్తే వారిని కుల బహిహ్కరణ చేసేవారు. ఇప్పుడు తప్పు చేసిన వారు కులం రంగు పూసుకొని కులాన్ని పిలుస్తున్నారు.అదే గొప్పగా ఆయా కులాల వారు బావించే పరిస్థితి ప్రస్తుతం ఉంది.

అక్షరాస్యులు నిరక్షరాస్యులు అని రెండు వర్గాలుగా ప్రజలను పరిగిణిస్తే నిరక్షరాస్యులని చైతన్యం చేసే భాద్యత అక్షరాస్యులు తీసుకోవటం కొన్ని దశాబ్దాలుగా సమాజంలో ఉంది . ఇదివరకు కరణములు పల్లెల్లో న్యాయం,మంచి,చెడు చెప్పేవారు. ఈనాటి సమాజంలో మేధావులు కూడా ప్రభుత్వం ఏది చేసినా అడ్డగోలుగా సమర్దిస్తూ అదే సరైనదనే ధోరణిలో మాట్లాడటం చూస్తుంటే సామజిక స్పృహ కొరవడి ఆ లక్ష్మణ గీత చెరిగి పోయిందా…అంతా ఒకటేనా? అక్షరాస్యులు కూడా నిరక్షరాస్యులాగే ఏది మంచో..ఏది చెడో, ఏది తప్పో, ఏది ఒప్పో తెలియక మాట్లాడుతున్నారా? లేక తెలిసి కూడా నిరక్షరాస్యులులాగ ప్రవర్తిస్తున్నారా లేక కులమో,మతమో, పార్టీమీద వల్లమాలిన అభిమానంతో ఇలా మాట్లాడుతున్నారో తెలియదు…అర్దంకాదు. గడిచిన ఎన్నికల్లో ఒక పార్టీ సొంతంగా రెండో పార్టీ బిజెపి మిత్రపక్షంగా పోటీ చేస్తే ప్రజలు బూత్ లలో బారులు తీరి నిలబడి మరీ ఓటేసి, ఒక పార్టీకి 100కి పైగా రెండో పార్టీకి 67 అసెంబ్లీ సీట్లు, ఒక పార్టీకి 16 మరో పార్టీకి 9 పార్లమెంటు సీట్లు ఇచ్చేసారు. విభజన తర్వాత ప్రజలు కాంగ్రెస్ కు ఘోరీ కడితే నాటి చట్టం చేసిన మంత్రులు పురందరీశ్వరి, కావూరి పార్టీ మారితే వారిని తిరస్కరించారు. ఆనాటి కేంద్ర మంత్రులందరనీ ఇంటి దగ్గర కుర్చోపెట్టారనే నిజాన్ని విస్మరించకుండా పనిచేయాల్సిన భాద్యత రెండు పార్టీలపైనా ఉంది. ఇప్పుడన్నా ప్రజల వైపు వారి అవసరాల కోసం పొరాటం చేయండి. కేంద్రంలొ మీ పార్టీలు ఎప్పటికి అధికారంలొకి రాలేవు. మీకు అధికారం వచ్చేది రాష్ట్రంలో మాత్రమే. రాజ్యం ఎప్పుడూ ఎవరూ ఇవ్వరు. రాచరికంలొ లాక్కోవటం, ప్రజాస్వామ్యంలొ ప్రజల మనసు దోచుకొవటంతోనే రాజ్యం, అధికారం పొందటం సాధ్యం. ఇది గుర్తెరిగి ప్రతిపక్షం ప్రజలవైపు పోరాటం చేయాలి. [pullquote position=”right”]అలాగే ప్రతిపక్ష పార్టీకి 67 స్థానాలిచ్చి కొత్తగా వచ్చిన పార్టీఅయినా ప్రజలు ఆదరించి ఓట్లు వేశారు. ప్రతిపక్షం కూడా హోదా కోసం పోరాటం చేయటం లేదు. ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన రీతిలొ తగినంత ఒత్తిడి ఎందుకు చేయడం లేదో తెలియదు. [/pullquote] ప్రతిపక్ష నాయకుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదా తెస్తే ప్రజలు ఆదరిస్తారు. అధికార పక్షం ఎలాగూ మిత్రధర్మాన్నికై  రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలకి అటువంటి ముందర కాళ్ల బంధాలు లేవు గాబట్టి పోరాటాన్ని తక్షణం పెంచాల్సి ఉంది.

ప్రజలకు మరో నాలుగేళ్ళ వరకూ అవకాశం రాదు ఓటేయడానికి. ఇప్పుడు తమ కర్తవ్యం సరిగ్గా నిర్వహించకపోతే ఆ ఓటేసే రోజు ప్రజాగ్రహానికి గురికావాల్సివస్తుందనే వాస్తవాన్ని గ్రహి౦చి ఇరుపార్టీలు ప్రత్యేకహోదా కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆనాటి “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” ఉద్యమస్పూర్తితో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే, అలాగా తెచ్చిన ఏ పార్టీనయినా సరే ప్రజలు ఆదరిస్తారు. ప్రత్యేక హోదా తెస్తే ఆంధ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, ఉద్యోగవకాశాలు మెరుగవుతాయి. కనుక పరిశ్రమలు రావాలన్నా, పెట్టాలన్నా ప్రస్తుతం ఆంధ్రలో భూముల రేట్లు ఎక్కువగ ఉన్నాయన్న అవరొధాన్ని అధిగమి౦చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్ర వైపు చూడాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని గ్రహించి ఆ దిశగా అడుగేసి కేంద్రం మెడలు వంచో…లేదా నయానో బయానో నచ్చజెప్పయినసరే ప్రత్యేక హోదా సాధించి ఆంధ్రని అభివృద్ది పధంలో నడపాలి.

నైతిక విలువలున్న రాజకీయనేత వెంకయ్య నాయుడుగారు అధికార, ప్రతిపక్షాలను అవసరం మేరకు కలుపుకుని లక్ష్య సాదనలో మోడీని ఒప్పించో , మెప్పించో ప్రత్యేక హోదా సాధిస్తే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆచంద్రార్కం ఉండిపోతారు. ఆ దిశగా నాయుడు ఆశయాన్ని సాధిస్తాడని ఆశిద్దాం….

ఆశావహులుగా …

వ్యాసకర్త

యార్లగడ్డ వెంకట్రావు

డల్లాస్, టెక్సాస్.

yarlagadda9999@yahoo.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ స్పీడుకు ‘వ‌ర‌ద‌లు’ బ్రేక్!

2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు సినిమాల‌కు లాంగ్ బ్రేక్ ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ త‌ర‌వాత ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌డం, ఆ వెంట‌నే పాల‌నా ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌డం...

FTL, బఫర్‌ జోన్లు అంటే ఏమిటంటే ?

ఇప్పుడు అందరూ చెరువులు, హైడ్రా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఎఫ్‌టీఎల్ అంటే ఏమిటి.. బఫర్ జోన్ అంటే ఏమిటి అన్నదానిపై చాలా మందికి క్లారిటీ ఉండటం...

ఈ హీరోయిన్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్‌!

కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి హిట్ 'ఉప్పెన'తో కొట్టింది కృతిశెట్టి. తెలుగులో ఇది తనకు తొలి సినిమా. అంతకుముందు హిందీ సినిమా సూపర్ 30లో ఓ చిన్న...

అపార్టుమెంట్ కొనుక్కుంటే విలువ పెరగదా ?

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఓ కొరిక. సొంత ఇల్లు అంటే... చుట్టూ ఖాళీ స్థలం, కొన్ని చోట్లు .. ఉండేలా పొందికైనా ఇల్లు అని గతంలో ఊహించుకునేవారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close