తెలంగాణాలో విద్యుత్ ప్రాజెక్టులకు భారీ రుణాలు

తెలంగాణాను పట్టిపీడిస్తున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇదివరకు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో 1,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకొన్నారు కానీ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరాకు అవసరమయిన ట్రాన్స్ మిషన్ లైన్స్ లేకపోవడంతో ఆ ఒప్పందం అమలులోకి రాలేకపోయింది. కానీ తెలంగాణా ప్రభుత్వం చేస్తున ఇతర ప్రయత్నాలు మాత్రం ఒకటొకటిగా ఫలించడం మొదలయ్యాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టును మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.

పాల్వంచలో నెలకొల్పుతున్న 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ తెలంగాణా ప్రభుత్వానికి రూ. 4, 321 కోట్లు ఋణం అందించింది. ఇది కాక పవర్ ఫైనాన్స్ కమీషన్ కూడా మరో రూ.4, 000 కోట్లు ఋణం మంజూరు చేసింది. నల్గొండ జిల్లాలో దామరచర్ల వద్ద నెలకొల్పుతున్న యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు కోసం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నిన్న రూ. 16, 070 కోట్లు ఋణం మంజూరు చేసింది. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ శర్మ ఆ చెక్కును నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా అందజేశారు. తెలంగాణా రాష్ట్రంలో నెలకొల్పుతున్న ఈ మూడు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం తెలంగాణా ప్రభుత్వం మొత్తం రూ. 24, 391 కోట్లు సంపాదించినట్లయింది.

దేశంలో మరే రాష్ట్రానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఇంత భారీ మొత్తం ఋణంగా ఇవ్వలేదని, విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు తెలంగాణా ప్రభుత్వం చిత్తశుద్దిగా చేస్తున్న ప్రయత్నాలను చూసి ఇంత భారీ ఋణం మంజూరు చేసిందని తెలంగాణా ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలియజేసారు. మిగిలిన రాష్ట్రాలలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మాణానికి ఈ సంస్థ 11.5 శాతం వడ్డీ తీసుకొంటుంటే తెలంగాణా ప్రభుత్వం వద్ద నుండి మాత్రం 11 శాతం వడ్డీ మాత్రమే తీసుకొనేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. దాని వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.500 కోట్లు భారం తగ్గుతుందని ఆయన తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట్రిమార‌న్‌తో సినిమా చేయాల‌ని ఉంది: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మ‌న‌సులో మాత్రం.. ఓ దర్శ‌కుడు ప్ర‌త్యేక స్థానాన్ని ఆక్ర‌మించుకొన్నాడు. త‌న‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ ఆస‌క్తి చూపిస్తున్నాడు....

సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క...

నెక్ట్స్ వివేకా కేసులో గీత దాటిన వైపీఎస్‌లే !

ఐపీఎస్‌లు అనే పదానికి అర్థం మార్చేసి వైపీఎస్‌ల తరహాలో చెలరేగిపోయిన అధికారులకు ఇప్పుడు తాము ఎంత తప్పు చేశామో తెలిసే సమయం వచ్చింది. ప్రభుత్వం మారగానే వారు చేసిన తప్పులన్నీ మీద పడిపోతున్నాయి....

కాంగ్రెస్ లో కొత్త షార్ట్ కట్… వర్కింగ్ టు కింగ్.. !

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే.. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి..అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close