గోపీ కృష్ణ, బలరాంలను విడిచిపెట్టనున్న ఉగ్రవాదులు

లిబియాలో ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణలను ఈరోజు రాత్రి  ఉగ్రవాదులు విడిచిపెట్టే అవకాశం ఉందని సమాచారం. డిల్లీలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసారు. త్వరలోనే వారిద్దరూ క్షేమంగా హైదరాబాద్ చేరుకొంటారని ఆయన తెలిపారు. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ ఇరువురూ నిన్ననే హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు.

తాము ఉపాద్యయులమని తెలుసుకొన్న ఉగ్రవాదులు తమను చాలా గౌరవంగా చూసుకొన్నారని, తమని పొరపాటున కిడ్నాప్ చేసామని వారే చెప్పారని తెలియజేసారు. బలరాం, గోపీకృష్ణ ఇరువురు కూడా క్షేమంగానే ఉన్నారని వారిని కూడా ఉగ్రవాదులు విడిచి పెట్టేస్తారని నిన్ననే వారు చెప్పారు. వారు చెప్పినట్లుగానే మిగిలిన ఇద్దరినీ కూడా ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఈరోజు రాత్రి విడిచిపెట్టవచ్చునని విదేశాంగ శాఖ అధికారులు తనకి తెలియజేసినట్లు కంబంపాటి తెలిపారు. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో చిక్కి ఈవిధంగా క్షేమంగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు బహుశః వీరు నలుగురేనేమో? నిజంగా ఆ నలుగురూ మృత్యుంజయులని చెప్పవచ్చును. వారికి ఇది పునర్జన్మ వంటిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం.. కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. మొదట్లో ఈ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదనుకున్నారో ఏమో, మరికొంతమంది...

వాళ్ల కాళ్ల‌కు నేను కూడా మొక్కుతా… సీఎం చంద్ర‌బాబు

సీఎం చంద్ర‌బాబు త‌న‌ను తాను మార్చుకోవ‌టంలో ముందుంటారు అనేది ద‌గ్గ‌ర‌గా చూసిన వారి మాట‌. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం నిజ‌మే అనిపిస్తోంది. సీఎంగా ఎవ‌రున్నా ఆయా పార్టీల నేత‌లు, ప్ర‌జ‌లు కొంద‌రు...

రేవంత్ ప‌ర్ఫెక్ట్ స్కెచ్… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల చేరిక అస‌లు వ్యూహాం ఇదా?!

సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక‌... త‌న దూకుడు మ‌రింత పెంచారు. కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను పిలిపించుకొని మాట్లాడుతున్నా, ప్ర‌తి రోజు క‌లుస్తున్నా... వ‌ల‌స‌ల‌ను ఆప‌లేక‌పోతున్నారు. రేవంత్ రెడ్డి ప‌క్కా వ్యూహాంతో, సీక్రెట్...

ఎక్స్‌క్లూజీవ్‌: ప్ర‌భాస్ టైటిల్ ‘ఫౌజీ’

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close