కేసీఆర్ డైరెక్షన్లో తెరాస ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పోరాటాలు?

వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చును…నమ్మశక్యంగా కూడా లేకపోవచ్చును. కానీ తెలంగాణాలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటాలను చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏఏ అంశాలపై తెలంగాణా ప్రభుత్వంతో పోరాడాలనే దానిపై  ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా వారికి అజెండా ఇస్తుంటే వారు దానినే గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లుంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల ముందు కొమ్ములు తిరిగిన కాంగ్రెస్,తెదేపా, బీజేపీ నేతలు కూడా పనికిరారనిపిస్తుంది. వారందరూ కూడా సాలెగూడు వంటి ఆయన వ్యూహాలలో చిక్కుకొన్నప్పటికీ ఆ సంగతి గ్రహించలేక తామే ఆయనిని ధీటుగా ఎదుర్కొంటున్నామనే భ్రమలో ఉన్నారు. వారిని ఆ భ్రమలో ఉంచి కేసీఆర్ తన పని తాను చేసుకుపోతున్నారు. నిజానికి వారిని ఆ భ్రమలో ఉంచేందుకే కేసీఆర్ వారి కోసం నిత్యం ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం ప్రకటిస్తున్నట్లుంది.

ఇదివరకు ఎర్రగడ్డ ఆసుపత్రి పక్కన చారిత్రిక కట్టడాన్ని కూల్చివేస్తానని చెప్పడం, ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ భూములలో పేదలకు ఇళ్ళు నిర్మిస్తానని చెప్పడం, కొన్నాళ్ళు ఓటుకి నోటు కేసు, మళ్ళీ ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి వేస్తానని చెప్పడం వంటివన్నీ కూడా ప్రతిపక్షాల దృష్టి మళ్ళించి వారిని బిజీగా ఉంచేందుకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా మిషన్ కాకతీయ, రైతుల ఆత్మహత్యలు, పంటరుణాల మాఫీ, జి.హెచ్.ఎం.సి ఎన్నికలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటాయి. దాని వలన రాష్ట్రప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.

ప్రభుత్వం తన పనులను సజావుగా నడిపించుకోవాలంటే ముందు ప్రతిపక్షాలను వేరే ఏదో అంశం మీదకు దృష్టి మళ్ళించేలా చేయడమే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అయన ఒకదాని తరువాత మరొక వివాదాస్పద నిర్ణయాలు ప్రకటిస్తూ ప్రతిపక్షాలకు పని కల్పిస్తున్నారు. ఒక అంశంపై వాళ్ళ రాద్ధాంతం పూర్తికాగానే దానిని ఆయన పక్కన పెట్టి మరొకటి వాళ్ళకి అందిస్తూ వాళ్ళని వేరే ఇతర అంశాలపై దృష్టి పెట్టకుండా జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అంటే ప్రతిపక్షాలు ఏ అంశంపై పోరాడాలనే ఎజెండాని కూడా ముఖ్యమంత్రి కేసీఆరే నిర్దేశిస్తున్నట్లు అర్ధమవుతోంది. కానీ ప్రతిపక్షాలు ఆయన పన్నిన ఈ ఉచ్చులో చిక్కుకొన్న సంగతి గ్రహించకుండా వరుసగా అయన అందిస్తున్న వివాదాలని పట్టుకొని పోరాడుతూ తామే ఆయనని నిలువరిస్తున్నామనే వెర్రి భ్రమలో మునిగిఉన్నాయి. బహుశః ఇప్పుడు కూడా ఉస్మానియా ఆసుపత్రిపై ప్రతిపక్షాలలో వేడి తగ్గగానే దానిని పక్కనబెట్టి మరొక వివాదస్పద నిర్ణయాన్ని ప్రకటిస్తారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close