కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడని సామెత. ఇప్పుడు వైసీపీ రిక్రూట్ చేసుకున్న కొత్త సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఇలాగే తయారయ్యారు. వందల మందిని రిక్రూట్ చేసుకున్నా ఎప్పటికప్పుడు దొరికిపోయేవాళ్లను ఎంపిక చేసుకోవడంతో రోజూ పరువు తీసుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు. అరిగిపోయిన వీడియోలు, ఫోటోలు తీసుకు వచ్చి.. ఏపీ నాశనం అయిపోయిందని.. ప్రచారం చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. అవన్నీ గతంలో వైరల్ అయి… ఎక్కడి వీడియోలో అందిరకీ తెలిసినవే.
ఎప్పటి వీడియోలు తెస్తున్నార్రా అయ్యారా ?
మూడు నాలుగేళ్ల కిందటి వీడియోలు.. అవి కూడా వైరల్ అయి అప్పట్లో అందరూ చర్చించుకున్న వీడియోలను తెచ్చి ఇప్పుడు ఏపీలో జరిగిందని చెబుతున్నారు. విద్యార్థిని ముఖం మీద కారు బురద చల్లే వీడియో, యానాంలో గోతుల్లో పడిన బైక్.. ఇలా చాలా పాత వీడియోలు తీసుకు వచ్చి.. ఏపీని నాశనం చేశారంటున్నారు. చివరికి తెలంగాణ వీడియోలను ఏపీ అని ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. వీళ్ల హడావుడి చూస్తే.. ఎవరికైనా.. వైసీపీలో కొత్త బ్యాచ్.. బుర్రలేని బ్యాచ్ దిగిందని అర్థమైపోతుంది.
నెటిజన్లు అంటే అంత అమాయకులు కాదు..మీకన్నా తెలివి గలవాళ్లు !
సోషల్ మీడియాలో ఫేక్ స్ప్రెడ్ చేస్తే చాలు అంతా సెట్ అయిపోతుందని.. అదే ప్రచారం అనుకుంటున్నారు. కొత్తగా ఏదైనా జరిగితే..దాన్ని ఫేక్ రూపంలో నెరేటివ్ చేస్తే ఓ అర్థం ఉంటుంది కానీ.. ఎప్పుడో వైరల్ అయిన వీడియోల్ని..అది కూడా ఏపీకి సంబంధం లేని వాటిని తీసుకు వచ్చి వైరల్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు. ముఖం మీదే నవ్వి వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో తిరిగే వారంతా తెలివి తక్కువ వారు అనుకుకుంటే అంత అమాయకులు ఉండరు. ఆ సోషల్ మీడియానే వారికి అన్నీ నేర్పుతుంది. అందుకే అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. కానీ కొత్త వైసీపీ పెయిడ్ బ్యాచ్ కు.. కొత్త బిచ్చగాళ్ల తరహాలో .. పాత వీడియోలనే పండగ చేసుకుంటున్నారు.
ఎంత మందిని కేసుల పాలు చేస్తారు ?
వైసీపీ తమ స్వార్థ రాజకీయాల కోసం అభిమానం ఉన్న వారిని, ఉపాధి లేని వారిని సోషల్ మీడియా కార్యకర్తలుగా మారుస్తోంది. వారితోఫేక్ ప్రచారాలు చేయించి.. వారిపై కేసులు నమోదుకు కారణం అవుతోంది. ఈ కేసుల కారణంగా ఆయా కుటుంబాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఇలా అరెస్ట్ అయిన వారందరికీ తాము డబ్బులు ఇస్తామని ఆశ పెడుతున్నారు. తాత్కలికంగా చేసే సాయాన్ని చూపి వారి జీవితంపై నేరస్తులనే ముద్ర వేసేందుకు వెనుకాడటం లేదు. వైసీపీ నేతల ట్రాప్ లో పడి.. కొన్ని వందల మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
