సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా టీడీపీ ముద్ర – వైసీపీకి ఏం దుస్థితి ?

సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముడితే అది టీడీపీ సమస్య అన్నట్లుగా తప్పించుకోవాలని చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ట్యాపింగ్ సమస్య విపక్ష నేతలు చేస్తే… అది రాజకీయం అని తప్పించుకోవచ్చు కానీ సొంత పార్టీ నేతలు చేస్తున్నారు. ట్యాపింగ్ ఫ్రూఫ్ కూడా రిలీజ్ చేశారు. అది ట్యాపింగ్ కాదని నిరూపించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై పడింది. కానీ ప్రభుత్వం మాత్రం అది ట్యాపింగ్ కాదు..,రికార్డంగ్ అని ప్రత్యారోపణులు చేయిస్తోంది. కానీ నిజంగా ఏం జరిగిందో … ప్రభుత్వంలో చాలా మందికి స్పష్టంగా తెలుసు.

ప్రస్తుతం ఈ అంశం కేంద్ర హోంశాఖ దగ్గరకు వెళ్లే సూచనలు కనిపిస్తూండటతో కోటంరెడ్డిపై వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన టీడీపీతో చంద్రబాబుతో లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో కోటంరెడ్డి తర్వాత అడుగు ఏం వేస్తారో కానీ ఆయనకు మరికొంత మందిజత కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సజ్జల మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీం అని.. దీనిలో కోటంరెడ్డి లాంటి వాళ్ళు పాత్రధారులని ఆరోపిస్తున్నారు.

రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉందని.. అందుకే లేని విషయాలను ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందని చెప్పుకొస్తన్నారు. ప్రజలకు సంబంధించి మాట్లాడే అంశాలు లేకపోవడంతోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. నిజానికి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న వారంతా వైసీపీ నేతలే. ఈ విషయాన్ని కప్పి పుచ్చి సజ్జల రాజకీయం చేసేద్దామనుకుంటున్నారు. కానీ సకల శాఖ మంత్రిగానే కాకండా.. ఇంటలిజెన్స్ ను నియంత్రించిన రాజ్యాంగేతర శక్తిగా కూడా ఆయనదే కీలక పాత్ర అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద పడుతూండేసరికి.. అది టీడీపీ ప్రాబ్లం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“ఆహా” ఆదాయం కన్నా నష్టాలే ఎక్కువ !

ప్రముఖ ఓవర్ ది టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా మంచి పనితీరు కనబరుస్తున్నప్పటికీ నష్టాలు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. భారత కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన...

ఇప్పుడు “మంత్రుల టిక్కెట్లు” చింపే ధైర్యం ఉందా !?

ముగ్గురు, నలుగురు టిక్కెట్లు చినిగిపోతాయని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల్ని హెచ్చరించారు. ఆ తర్వాతి రోజే ఎవరెవర్ని తీసేస్తారు.. ఎవరెవర్ని తీసుకుంటారు అనే లీకులు కూడా సజ్జల క్యాంప్ నుంచి...

ప్రభం”జనం”లా మారుతున్న లోకేష్ పాదయాత్ర !

లోకేష్ పాదయాత్రకు వస్తున్న జనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ రోజుకారోజూ అంచనాలకు అంతనంత మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా గోరంట్లలో లోకేష్ పాదయాత్రలో...

ఏపీ పేరును ” వైఎస్ఆర్‌ ఏపీ ” అని మార్చేశారా !?

ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ విధానం అమలు చేయాలంటే... ఏపీ అని ప్రారంభిస్తుంది. అంటే ఏపీ భవన నిర్మాణ విధానం, ఏపీ పారిశ్రామిక విధానం,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close