స‌ర్‌ప్రైజింగ్ కాంబోలో… సందీప్ సినిమా

‘అండ‌ర్ రేటెడ్‌’ ట్యాగ్ వేసుకొన్న హీరో.. సందీప్ కిష‌న్‌. పాపం.. క‌ష్ట‌ప‌డుతుంటాడు కానీ, స‌రైన ఫ‌లితాలు రావ‌డం లేదు. త‌న‌ రెండేళ్ల క‌ష్టం.. ‘మైఖేల్‌’. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌డంలో, ఇలా.. భారీ ఎత్తున విడుద‌ల కావ‌డంలో త‌న పాత్ర ఎంతో ఉంది. ‘మైఖేల్‌’ అనేది సందీప్ కిష‌న్ బ్రెయిన్ ఛైల్డ్‌. ఓ ఐడియా ప‌ట్టుకొని, ద‌ర్శ‌కుడ్ని వెదుక్కొని, ప్రాజెక్ట్ సెట్ చేసుకొన్నాడు. రేపు (శుక్ర‌వారం) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాపై సందీప్ చాలా ధీమాగా ఉన్నాడు. ”ఓ మంచి క‌థ‌. స‌రైన ఆర్టిస్టులు. కావ‌ల్సిన డ్రామా, కోరుకొనే యాక్ష‌న్‌.. ఇవ‌న్నీ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా త‌ప్పు చేయ‌దు” అంటూ మైఖేల్ పై న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు. ”పేప‌ర్ పై రాసుకొన్న సినిమా… తెర‌పైకొస్తే స‌రిపోతుంది. కానీ ప‌ది రెట్లు బాగా తీశాం. ఈ క‌థ‌ని ఇంత‌కంటే ఎవ‌రూ బాగా చెప్ప‌లేడు. అందుకే నాకీ సినిమాపై ఇంత న‌మ్మకం ఏర్ప‌డింది..” అంటున్నాడు సందీప్‌. త‌న రాబోయే సినిమాల లైన‌ప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ధ‌నుష్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. భైర‌వ‌కోన చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. వీట‌న్నింటితో పాటు.. త్వ‌ర‌లోనే ఓ షాకింగ్ ప్రాజెక్టుతో వ‌స్తున్నాడ‌ట‌. ఆ కాంబినేష‌న్ చూసి ప్రేక్ష‌కులే ఆశ్చ‌ర్య‌పోతార‌ని, తాను కూడా క‌ల‌లో కూడా ఇలాంటి ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాన‌ని ఊహించ‌లేద‌ని… చెప్పుకొచ్చాడు సందీప్‌. మ‌రి ఆ ద‌ర్శ‌కుడెవ‌రో, ఆ ప్రాజెక్టు ఏంటో…? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

కృతిశెట్టికి బూస్ట్ లాంటి ఆఫర్

'ఉప్పెన' సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ కేటగిరీలో కి వెళ్ళిపోయింది కృతిశెట్టి. నిజంగా ఒక ఉప్పెనలానే ఆమెకు అవకాశలు దక్కాయి. కానీ విజయాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీ విజయాలే కీలకం. అందం, అభినయం...

రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ వృత్తినే వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని, ప్రభుత్వం చంద్రబాబుకు...

‘స్కంద’ మౌనముద్ర !

ఈ 28న వస్తోంది రామ్, బోయపాటి శ్రీనుల స్కంద. ఇప్పటికే సినిమా టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ వదిలేశారు. బాలకృష్ణ అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ తరహలో ఓ వేడుక కూడా జరిగింది. ఇక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close