పాపం వైకాపా నేతలు!

వైకాపా నేతలు నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిని బుజ్జగించి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘తెదేపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోబోతున్నారంటూ తన తోక మీడియా ద్వారా ప్రచారం చేయిస్తూ తమని మానసికంగా దెబ్బ తీయాలని ప్రయత్నోస్తోందని ఆరోపించారు. భూమానాగిరెడ్డి వైకాపాలోనే ఉంటారని’ చెప్పారు.

21మంది తెదేపా ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని ఏ క్షణాన్నయిన ప్రభుత్వాని కూల్చగలనని చెప్పడం ద్వారా ఈ మైండ్ గేమ్స్ మొదట మొదలు పెట్టింది తమ అధినేత జగన్మోహన్ రెడ్డేనని వారికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు చిన్న ఎత్తు వేసి భూమానాగిరెడ్డి ద్వారా వైకాపాకి చిన్న జలక్ ఇవ్వడంతో చిత్తయిపోయి, తెదేపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతూ తమని మనోబలం దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపిస్తుంటే అందరూ నవ్వుకొంటున్నారు.

రాజకీయాలలో ఎవరో ఒకరు మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. అప్పుడు దానిని అవతలి వాళ్ళు ఎదుర్కొని తిరిగి ఎత్తువేసి చిత్తుచేయాలి. ఓటుకి నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు నాయుడుని జైలుకి పంపించేసి తెలంగాణాలో తెలుగు దేశం పార్టీని శాస్వితంగా భూస్థాపితం చేసేయాలని ప్రయత్నించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు దానికి ఏవిధంగా ప్రతివ్యూహం పన్ని కేసీఆర్ ని నిలువరించారో అందరూ చూసారు.

చంద్రబాబు నాయుడు శక్తిని, తెలివితేటలని తక్కువగా అంచనా వేసి జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న చిలిపి పనికి వైకాపా నేతలు అందరూ మూల్యం చెల్లించవలసి వచ్చింది. వైకాపా నేతలు తమ ఓటమిని, పరాభవాన్ని దిగ మ్రింగుకొంటూ ఆక్రోశిస్తుంటే ప్రజలు అందరూ నవ్వుకొంటున్నారు తప్ప జాలి పడటం లేదు. ఎందుకంటే అది స్వయంకృతాపరాధమే కనుక.

భూమానాగిరెడ్డి వైకాపాలోనే ఉంటారని వైకాపా నేతలు అందరూ చాలా గట్టిగా చెపుతున్నారు. కానీ ఆలయియన్ వ్యక్తి భూమా నాగిరెడ్డి మాత్రం ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి ఆ ముక్క చెప్పడం లేదు. కనీసం ఖండించడం లేదు అంటే దానర్ధం ఏమిటో వైకాపా నేతలే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“దిశ” బిల్లు ఏపీ ప్రభుత్వం దగ్గరే ఉందట..!

దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకోవడం అనే మిషన్‌ను ఎంపీలకు సీఎం జగన్ ఇచ్చారు. వారు పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే ముందు జగన్‌తో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తానించి.....

కృనాల్‌కు కరోనా… శ్రీలంకతో రెండో టీ ట్వంటీ వాయిదా..!

కాసేపట్లో ప్రారంభం కావాల్సిన శ్రీలంక-ఇండియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ అనూహ్యంగా వాయిదా పడింది. ఇండియా ఆటగాడు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం పాజిటివ్ గా రావడంతో ...

జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ దొర‌క‌డం లేదా?

టికెట్ రేట్ల గొడ‌వ ఇంకా తేల‌లేదు. ఈలోగానే రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిమ్మ‌రుసు, ఇష్క్ చిత్రాలు ఈనెల 30న విడుద‌ల అవుతున్నాయి. లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌ల అవుతున్న తొలి చిత్రాలివి....

మీడియా వాచ్ : టీవీ9 యాంకర్లపై కేసులు..!

టీవీ9 యాంకర్లు రోడ్డున పడ్డారు. కేసులు పెట్టుకున్నారు. దీంతో టీవీ9 యజమాన్యం కూడా ఉలిక్కిపడింది. వారి గొడవ పూర్తిగా వ్యక్తిగతమని చానల్‌కు.. వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేదని సోషల్ మీడియాలో ప్రకటించుకోవాల్సి...

HOT NEWS

[X] Close
[X] Close