రాజ్ తరుణ్ ఆ సినిమా చేయట్లేదా..!

హ్యాట్రిక్ స్టార్ రాజ్ తరుణ్ కాస్త జోష్ తగ్గిందనే చెప్పాలి.. మూడు హిట్స్ తో వీరంగం ఆడిన రాజ్ లేటెస్ట్ రిలీజ్ సీతమ్మ అందాలు సినిమాతో మన రామయ్య కు చుక్కలు కనిపించాయి.. అయితే సినిమా ఆ మూడు సినిమాల హిట్ వేడి మీద మరి అంత ఘోరంగా ఏం పోలేదు. అయితే ప్రస్తుతం కెరియర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్న రాజ్ తీసుకునే నిర్ణయాలు.. ఒప్పుకునే సినిమాలను బట్టే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అందుకే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలే రెండు మూడు ఉన్నాయి. అయితే సీనియర్ దర్శకుడు వంశీ ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో రాజ్ నటుస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ ట్రైలర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సీక్వల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ ట్రైలర్ సినిమా తీయాలనుకున్నాడు.

ప్రస్తుతం క్రేజ్ దృష్ట్యా వంశీ సినిమాలు బాక్సాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపట్లేదు. వంశీ తీసిన వెన్నెల్లో హాయ్ హాయ్ సినిమా రిలీజ్ కష్టాలు పడి పడి చివరకు రిలీజ్ అయినా అది రిలీజ్ అయిన సంగతి కూడా ఎవరికి తెలియకుండానే పోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీనియర్ దర్శకుడి సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తే తన సినిమా పరిస్థితి కూడా అదే గతి పడుతుందని ఆలోచించి ఆ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే ఆ సినిమా కోసం కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట రాజ్, అయితే సినిమా చేయని పక్షంలో తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చే ఆలోచనలో ఉన్నాడట మరి రాజ్ చేస్తున్న పని మంచిదా కాదా అన్నది అతనికే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close