సర్వేలో సీట్లు తగ్గిపోయినా సంబరపడిపోతున్నారేంటి !?

వైసీపీ నేతల తీరు విచిత్రంగా ఉంది. తాజాగా వస్తున్న సర్వేల్లో ఓ మాదిరి ఫలితాలు వచ్చినా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. సీట్లు పడిపోతున్నాయని చెప్పినా.. దాన్నే ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆ పార్టీ పరిస్థితిపై .. వారికే నమ్మకం లేదని.. సెటైర్లు పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైన.. ఏపీ ప్రభుత్వం ఇమేజ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా పొందిన ఇండియా టుడే గతంలో జగన్ ఎక్కడో ఉన్నట్లుగా సర్వేలు ప్రకటించేది. తాజా సర్వే లో మాత్రం ఆయన పట్ల కాస్త కనికరం చూపించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పద్దెనిమిది సీట్లు వస్తాయని చెప్పింది.

నిజానికి ఇప్పుడు వైసీపీకి ఇరవై రెండు సీట్లు ఉన్నాయి. నాలుగు సీట్లు తగ్గిపోతాయని చెప్పింది . అయినా సరే అంతకు మించిన సంతోషం మరొకరటి లేదన్న అధికారి ట్విట్టర్ హ్యాండిల్స్‌లోనే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీ నేతల తీరు చూసి.. తమ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారికి కూడా అర్ధమైందని అందుకే ఓ మాదిరి ఫలితాలు వచ్చినా సంతోషపడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. జాతీయ సర్వేల విషయంలో ఏపీలో గతంలో తప్పయినవే ఎక్కువ. ఏపీ ఓటర్ల నాడిని వారు పట్టుకోలేరు. అయినాసరే.. ప్రతీ పార్టీకి ఎన్నో కొన్ని రావడం ఖాయం కాబట్టి ఆ సర్వేలిస్తూ ఉంటారు.

ఏపీలో జరుగుతున్న పరిణామాలపైనా వారికి అవగాహన లేదు. ఢిల్లీ మీడియాను మేనేజ్ చేయడానికివైసీపీ ప్రజాధనం కోట్లు ఖర్చు పెడుతోంది. అంత చేస్తున్నా.. టీడీపీ ఇంకా మెరుగుపడుతోందనే నివేదకలే వస్తున్నాయి. అయితే తమ అంచనాల కన్నా తక్కువగానే వైసీపీ పతనం ఉందని .. సంబరపడుతున్నట్లుగా కనిపిస్తోంది.కానీ వారిఈ వేడుకలు చూసిన వారికి మాత్రం.. పడిపోయినా సంబరాలు చేసుకుంటున్నారే..అంటే.. సీన్ అర్థమైపోయిందా అని సెటైర్లు వేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close