పవన్ తో జగన్ పొత్తులు పెట్టుకోవచ్చు అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొత్త భజన ప్రారంభించారు. అసెంబ్లీలో బాలకృష్ణ ఏమీ అనని మాటల్ని ..చిరంజీవికి అవమానం.. పవన్ ఎందుకు మౌనం అంటూ.. తమ శక్తిమేర రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ టీడీపీకి వదిలేసి జగన్ తో కలిసి పొత్తులు పెట్టుకోవాలనట. అసలు ఈ ఆలోచనే వారికి ఎలా వచ్చిందో.. ఇలాంటి పోస్టులు పెడుతున్నా.. ఎందుకుపై స్తాయిలో నివారించడం లేదో కానీ.. ఇదేదో టెస్టింగ్ లాగా ఉందని కొంత మంది అనుమానిస్తున్నారు.
జగన్తో రెడ్డితో సొంత పార్టీ నేతలకే సరిపడదు. ఆయన పొత్తుల పేరుతో అందర్నీ వాడుకుని వదిలేస్తారు. కమ్యూనిస్టు పార్టీల్ని తన రాజకీయాల కోసం ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. కానీ ఎన్నికల్లో సీట్లు అనే సరికి మాత్రం పట్టించుకోరు. ఇప్పటికే సీపీఎం పార్టీని బాగానే ఉపయోగించుకుంటూ ఉంటారు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత కాలం వైసీపీకి విజయం కాదు కదా.. కనీసం పరువు కూడా దక్కదని ఉండవల్లి వంటి వారు నేరుగానే చెబుతున్నారు. దీనిపై సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారమో కానీ సోషల్ మీడియాలో పొత్తుల ప్రకటనలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలనాటికి హోప్స్ లేకపోతే జగన్ ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ కు సీఎం పదవి ఇస్తామన్న ఆఫర్ ఇస్తే .. జనసేన పార్టీ ఆలోచించే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు కొంత మంది సోషల్మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సీఎం పదవి ఇస్తారా అన్నది మాత్రం ఎవరూ నమ్మరు. కూటమిని విచ్చిన్నం చేయడానికి వచ్చిన అవకాశాలను వైసీపీ తనదైన పద్దతిలో ఉపయోగించుకుంటోంది. ఇది రాజకీయంగా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది భవిష్యత్తే తేల్చాలి.