ఎన్డీఏలోని పార్టీ వ్యతిరేకిస్తే మద్దతుగా వైసీపీ ఓటు..!

కేంద్రానికి సహకరించే కొద్దీ సహకరించాలని వైసీపీకి అనిపిస్తున్నట్లుగా ఉంది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఉన్న 28 మంది ఎంపీలతో.. కేంద్రం ఎప్పుడు ఏ బిల్లు పెట్టినా అనుకూలంగా మాట్లాడించడమే కాదు… అవసరమైనప్పుడల్లా ఓటు వేయిస్తోంది. తాజాగా..వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లుకు కూడా.. ఏకపక్షంగా వైసీపీ ఆమోదం తెలిపింది. అందులో రైతులకు నష్టం కలిగే అంశాలపై సవరణలు చేయాలని కూడా డిమాండ్ చేయలేదు. ఈ బిల్లుకు నిరసనగ ఎన్డీఏ మిత్రపక్షం అయిన అకాలీదళ్ కు చెందిన కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేసేశారు. ఎన్డీఏ నుంచి వైదొలిగేందుకు కూడా ఆలోచిస్తున్నామని ప్రకటించారు.

అకాలీదళ్ బీజేపీకి సుదీర్ఘ స్నేహితుడు. అందరూ బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న సమయంలో అకాలీదళ్‌తో పాటు శివసేన బీజేపీతో పొత్తుల్లో ఉండేవి . శివసేన గతంలోనే బయటకు వెళ్లగా.. తాజాగా అకాలీదళ్ బయటకు వచ్చేసింది. దాంతో.. ఎన్డీఏలో బలం ఉన్న పార్టీల సంఖ్య మరింత తగ్గిపోయింది. వ్యవసాయ బిల్లుపై ఉత్తరాదిలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ బిల్లు వల్ల ప్రభుత్వం తన బాధ్యతను తగ్గించుకుంటోందని.. ప్రైవేటు వ్యాపారస్తులకు అనుకూలంగా… నిర్ణయం తీసుకుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగా పెద్ద ఎత్తున రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.. పెద్ద ఎత్తున పంటలు పండించే పంజాబ్‌లో ఈ బిల్లుపై నిరసనలు ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్‌కే చెందిన హర్‌సిమ్రత్‌కౌర్ ఈ వ్యవసాయ బిల్లుపై అసంతృప్తిగానే ఉన్నారు. అందుకే రాజీనామా చేశారు. అయితే.. ఏపీ నుంచి వైసీపీ మాత్రం.. ఈ బిల్లు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పైగా… పంజాబ్‌లో రాజకీయ పరిస్థితుల కారణంగానే హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారని.. వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు..తనకు అర్థమైనట్లుగా మీడియా ప్రతినిధులతో చెప్పుకొచ్చారు. మొత్తానికి కేంద్రానికి ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే… మద్దతివ్వడానికి వైసీపీ తహతహలాడిపోతోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close