వైసీపీలో సెగలు రేపుతున్న బెజవాడ మహిళా నేత “యాపారం” !

వైసీపీలో మహిళా నేతలూ తగ్గడం లేదు. విజయవాడలో ఓ మహిళా నేత యువతుల్ని ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్న వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఇద్దరు యువతులు ఆమెపై నేరుగా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ యువనేత అనచరురాలిగా ఎప్పుడూ హడావుడి చేస్తూ..సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే మహిళా నేతకు దుస్తుల దుకాణం ఉంది. ఆమె దుకాణానికి వచ్చే యువతుల్ని ట్రాప్ చేసిది. యువనేతతో ఉన్న పరిచయాలను చూపించి.. మాయమటలు చెప్పేది.

ఆకర్షితులైన వారి ఫోన్ నెంబర్లను తీసుకుని మొదట పార్టీలకు తీసుకెళ్లేది. మద్యం అలవాటు అయిన తర్వాత మెల్లగా అర్థనగ్న ఫోటోలు తీసి.. వాటితో తన వ్యాపారం ప్రారంభించేది. ఆ ఫోటోలను యువతులకే పంపి బెదిరించడమో లేకపోతే డబ్బులు బాగా వస్తాయని ఆశ పెట్టడమో చేసి.. వారిని వ్యభిచారకూపంలోకి దించేది. ఈ వ్యవహారంలో మోసపోయిన ఇద్దరు యువతులు నేరుగా కమిషనర్‌ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొందరిని ఇప్పటికే వ్యభిచార వృత్థిలోకి దింపడంతో.. రహస్య విచారణకు సీపీ ఆదేశించారు. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఆ మహిళ ఉన్నట్లుగా తెలుస్తోంది.

గతంలో రెండు గ్యాంగులు .. నడిబొడ్డున కత్తులు, కటార్లతో దాడులు చేసుకున్న వ్యవహారం ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అందులో ఓ గ్యాంగ్ లీడర్ అప్పుడే చనిపోయారు. ఇంకో గ్యాంగ్ లీడర్ బతికే ఉన్నాడు. ఆయనతో కలిసి ఈ మహిళా నేత ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆరోపణలు పెరిగిపోవడంతో.. వస్త్ర దుకాణం కూడా తెరవడం లేదు. ఇప్పుడీ వ్యవహారం విజయవాడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వైసీపీ నేత చేసిన నీచమైన పని కావడంతో పోలీసులు బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధపడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close