వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే మార్గాలు ఉన్నాయని … ఆ మార్గాల్లోనే ప్రయత్నిస్తామని నిరూపిస్తూ ఉంటారు. తాజాగా అదే చేస్తున్నారు.

విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి విశాఖ రాజధానిపై చేసిన కామెంట్స్ అంటూ ఓ వీడియోను సజ్డల సుపుత్రుడు భార్గవ్ రెడ్డి తన ఖాతాలో పోస్టు చేశారు. దానికి భరత్ చెప్పుతో కొట్టినట్లుగా అసలు వీడియో పెట్టి సమాధానం ఇచ్చారు. అయితే ఇలాంటివి మామూలే… తుడుచుకుని వెళ్లిపోతామన్న మానసిక స్థితికి వారు ఎప్పుడో చేరిపోయారు కాబట్టి తగ్గడం లేదు. పత్రికల పేరుతో ఫేక్ ఎడిట్లు … బీబీసీని, పీటీఐని సైతం వాడేసి ఫోటో షాప్ మార్ఫింగ్‌లు చేయడం కామన్ అయిపోయింది. బీబీసీ పేరుతో .. పురందేశ్వరి కామెంట్స్ అంటూ ఓ పోస్టర్ హైలెట్ చేశారు. బీబీసీ ఛీ అని తిట్టేసింది. పీటీఐ పేరుతో ఓ తప్పుడు సర్వేను వదిలాశారు. ఇంత చేతకాని సన్నాసులేంటని .. పీటీఐ పెద్ద ట్వీట్ పెట్టింది. ఇలాంటివి చూసుకుంటే… వైసీపీ సోషల్ మీడియా టోటల్ ఫేక్ గా బతికేస్తోంది. ఇంకా ఘోరం ఏమిటంటే విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై తప్పుడు ప్రచారం చేయడం. క్లియర్ గా ఫేక్ అని తెలుస్తున్నా.. నమ్మే గొర్రెలు నమ్ముతాయి కదా అని.. వైసీపీ నేతల ఉద్దేశం.

ఆఫ్ లైన్ లోనూ ఇదే పరిస్థితి. వైసీపీ నేతలు దొంగ నోట్లు పంచుతున్నారని పుకార్లు గట్టిగా వ్యాపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల దొంగ నోట్లు బయటడపడటం కలకలం రేపింది. ఇక వారు పంచే లిక్కర్ నకిలీది. అత్యంత హానికరమైన మద్యాన్ని లోకల్ గా తయారు చేసి పంచేస్తున్నారు. ఎవరి ప్రాణాలు పోతే మాకేంటి అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. ఇక… దాడులతో భయపెట్టాలనుకున్న వారి సంగతి చెప్పాల్సిన పని లేదు. గెలవాలంటే ప్రజలకు బుద్దిగా కనిపించాలన్న భావన వైసీపీ నేతల్లో లేదు. అది అసలు మార్గంగా వారు భావించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close