పబ్లిక్ , ప్రైవేటు పార్టనర్ షిప్ అంటే ప్రైవేటీకరణ అంటూ అడ్డగోలు ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తున్న వైసీపీ గవర్నర్ కు వినతి పత్రం అనే అంకం పూర్తి చేసింది. ఆ కోటి సంతకాలను గవర్నర్కు సమర్పించామని చెప్పారు కానీ అవి లోక్ భవన్ వద్దకు కూడా వెళ్లలేదు.తిరిగి వచ్చేశాయి. వాట్ నెక్ట్స్ అంటే కోర్టుకు వెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలు..ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం కూడా వారు కోర్టుకు వెళ్లేందుకు ఎదురు చూస్తోంది. అసెంబ్లీకి ఎలాగూ రారు.కోర్టుల్లో అయినా అసలు నిజం చెప్పి వారి ఫేక్ రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.
కోర్టులో పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని వాదించలేరు !
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయవద్దని వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయింది. దానికి తమ బలంగా కోటి సంతకాలను కోర్టుకు ప్రజెంట్ చేస్తామని అంటున్నారు. అంటే కోటి మంది పిటిషన్లు వేసినట్లుగా చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇలా ఫేక్ సంతకాలతో పిటిషన్లు కోర్టులు యాక్సెప్ట్ చేయవు. అందరి గుర్తింపు కార్డులు కావాల్సిందే. కానీ సాక్షిలో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పిటిషన్ వేసిన తర్వాత కోర్టులో ఏం వాదిస్తారు? . ప్రైవేటీకరణ అని వాదించలేరు. ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం లేదు.
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని వైసీపీనే అంగీకరించాల్సిన పరిస్థితి
పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ మోడ్ లో మెడికల్ కాలేజీను నిర్వహిస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. అది కూడా అన్ని కాలేజీలు కాదు. ప్రస్తుతానికి పది కాలేజీలకు మాత్రమే జీవోలు ఇచ్చింది. ఈ పది కాలేజీలు పూర్తి కావాలని ఆరేడు వేల కోట్లు కావాలి.. తర్వాత నిర్వహణకు ఇంకా చాలా పెద్దమొత్తం కావాలి. ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రమాణాలు ఎలా ఉంటాయో అందరూ చూస్తున్నారు. అందుకే ప్రమాణాలు మెరుగుపడటానికి అయినా సరే పీపీపీ మోడల్లోకి మారాలని నిపుణులు సూచిస్తున్నారు. పార్లమెంటరీ స్థాయీసంఘం కూడా అదే చెబుతోంది. కానీ వైసీపీ చెప్పినట్లుగా అక్కడ ప్రైవేటీకరణ జరగడంలేదు. ఈ విషయాన్ని వైసీపీ కోర్టులో అంగీకరించాల్సి వస్తుంది.
ప్రజల్ని మోసం చేసి అడ్డంగా దొరికిపోతారు !
వైసీపీ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత అసలు రాజకీయం ప్రారంభమవుతుంది. మెడికల్ కాలేజీలపై ఆ పార్టీ చేసిన నిర్వాకాలన్నీ వెలుగులోకి వస్తాయి. జగన్ హయాంలోనే ఆ మెడికల్ కాలేజీల్లో యాభై శాతం సీట్లు పేమెంట్ సీట్లు చేస్తూ జీవో ఇచ్చారు. కానీ నిర్మాణాలకు మాత్రం నిధులివ్వలేదు. ఇలాంటి కథలన్నీ బయటకు వస్తాయి. మెడికల్ కాలేజీల పేరుతో జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారం అంతా ప్రజల ముందుకు వస్తుంది. దాని కోసమే టీడీపీ నేతలు కూడా వెయిట్ చేస్తున్నారు.
