సానియా, హింగిస్ ఖాతాలో మరో టైటిల్

మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ జోడీ సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జైత్రయాత్ర కొనసాగుతోంది. చైనాలో జరిగిన మరో టోర్నీలో గ్యాంగ్జో టైటిల్ ను కైవసం చేసుకున్నారు. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఈ జోడీ, జు షిలిన్, యూ జియోడి జోడీని 6-3, 6-1 స్కోరుతో వరస సెట్లలో అలవోకగా ఓడించింది. మ్యాచ్ ఏ దేశలోనూ ప్రత్యర్థులు సానియో జోడీకి తగిన పోటీ ఇవ్వలేక పోయారు. సానియా, హింగిస్ స్టామినా, గేమ్ ప్లాన్, నైపుణ్యం ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు.

సానియా జోడీ ఇటీవలే యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెల్చుకుంది. అంతేకాదు, ఈ ఏడాది వీరి జోరుకు ఎదురు లేకుండా పోయింది. మార్చిలో వీరిద్దరూ జోడీ కట్టిన తర్వాత జోరుగా విజయపథంలో కొనసాగుతున్నారు.

ఇద్దరూ కలిసి 13 టోర్నమెంట్లు ఆడారు. అందులో ఆరు టోర్నీల్లో టైటిల్ గెల్చుకున్నారు. ఇండియన్ వెల్స్, మయామీ, చార్టెస్టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, తాజాగా గ్యాంగ్జూ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. అభిమానులను అలరించారు. ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ ఈ జోడీ అలుపెరగకుండా ఆడటానికి అలవాలు పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులతో రేవంత్ దూకుడు..!

మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్జీటీ వేసిన కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. జన్వాడలో ఉన్న కేటీఆర్...

ఏపీ సచివాలయంలో పది మందికి వైరస్..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో పని చేసే ఓ అధికారి డ్రైవర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ పది మంది సచివాలయ ఉద్యోగులకు...

ఫీజు కోసం మోహన్‌బాబు ఇప్పుడు కోర్టుకెళ్లరా..?: టీడీపీ

ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పేరు మార్చి.. నిబంధనలు మార్చి.. ప్రజాధనాన్ని ప్రైవేటు కాలేజీలకు దోచి పెడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అర్హత లేని కాలేజీల్లోనూ ఇష్టానుసారం ఫీజులు...

HOT NEWS

[X] Close
[X] Close