ఐటం పాప ఉన్నట్టా లేనట్టా..?

టాలీవుడ్లో ఓ రేంజ్ స్టార్ ఇమేజ్ వచ్చాకా బాలీవుడ్ నుండి పిలుపు రాగానే చటుక్కున వెళ్లిపోయింది చిట్టి నడుము సుందరి ఇలియానా. అక్కడ బర్ఫీతో హిట్ కొట్టినా అమ్మడికి మాత్రం కాలం కలిసి రాలేదు. ఎంత రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ గట్రా చేసినా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు అందుకే తనకు హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ ఇచ్చిన సౌత్ వైపే మళ్లీ చూపు మళ్లి ఇక్కడకు వచ్చింది.

అమ్మడు రాగానే అవకాశాలు ఎలా వస్తాయ్ చెప్పండి అదీగాక అమ్మడు మంచి ఫాంలో ఉన్నప్పుడు దర్శక నిర్మాతలకు పెద్ద హ్యాండ్ ఇచ్చి వెళ్లింది అందుకే వచ్చి ఛాన్స్ అంటూ వెంటబడుతున్నా ఆమెకేసి ఓ లుక్కు కూడా వేయట్లేదు మన దర్శక నిర్మాతలు. మొన్నామధ్య శ్రీనువైట్ల పుణ్యమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘బ్రూస్ లీ’లో ఐటం సాంగ్ కి ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయ్. అయితే చేసేది ఐటం సాంగే అయినా అమ్మడు రెమ్యునరేషన్ దాదాపు ఓ సినిమాకు తీసుకునేంత డిమాండ్ చేసిందట.

దానయ్య డివివి రూపంలో ఇల్లి బేబీకి అదృష్టం వచ్చిందేమో అనుకున్నారంతా కాని చూస్తే ‘బ్రూస్ లీ’ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఓ పక్క మెగాస్టార్ తో కూడా మూడు రోజులు షూటింగ్ చేస్తున్నారు. మరి ఫిల్మ్ నగర్ నుండైతే ఇలియానా ఐటం సాంగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇలియానా ఐటం సాంగ్ బ్రూస్ లీలో లేదన్న విషయం అర్ధమవుతుంది. పాపం బ్రూస్ లీతో మళ్లీ తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామనుకున్న ఇలియానాకి చివరకు నిరాశే మిగిలిందన్నమాట. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇలియానాకి బొత్తిగా తెలిసినట్టు లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close