ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే..! తీవ్రత కనిపిస్తుందా..?

వరద వచ్చి ఆరు రోజులు అయింది. ఇప్పుడు బురద మాత్రమే మిగిలింది. వరద వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించారు. మూడు జిల్లాల్లో హెలికాఫ్టర్‌లో ఆకాశ వీక్షణం చేసి వచ్చారు. నిజానికి ఏ సీఎం అయినా వరద తీవ్రంగా ఉన్నప్పుడే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి పంట నష్టం అంచనాలను కేంద్రానికి పంపుతారు. కేంద్ర సాయం అండుగుతారు. అయితే ఇంట్లో నుంచి బయట పెట్టకుండానే కేసీఆర్ రూ. నాలుగు వేల నాలుగు వందల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాశారు. అలా రాసిన మూడు రోజుల తర్వాత ఏరియల్ సర్వే చేశారు. నిజానికి ఆయన ఏరియల్ సర్వే చేస్తారని అనుకోలేదు.. హఠాత్తుగా షెడ్యూల్‌లో పెట్టారు.

సాయంత్రం 4 గంటల సమయంలో మరో ఇరువురు మంత్రులు కొడాలి నాని, హోంమంత్రి సుచరితతో కలిసి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణాజిల్లాలో ఏరియల్ వ్యూకు నిర్వహించారు. హెలికాప్టర్ లో మూడు జిల్లాల్లో ఏరియల్ వ్యూ ద్వారా తుపాన్ పీడిత ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతోపాటు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పంట నష్టం నివేదికలను, కూలిన, దెబ్బతిన్న ఇళ్ల వివరాలను తక్షణం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అంచనాలేమీ లేకుండా.. ఇంత నష్టం జరిగిందని కేంద్రానికి ఎలా లేఖ రాశారో చాలా మందికి అర్థం కాని విషయం .

హడావుడిగా జగన్ ఏరియల్ సర్వే చేయడం.. వెనుక కారణం లోకేష్ టూరేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో లోకేష్ వరుసగా పర్యటిస్తున్నారు. మొదట గుంటూరు వెళ్లారు. ఇప్పుడు తూ.గో జిల్లాకు వెళ్లారు. మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. వెళ్లిన చోటల్లా.. రైతులు… వరద బాధితులు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు. కనీసం వచ్చి చూసిన వారు కూడా లేరంటున్నారు. ఈ విషయం హైలెట్ అవుతూండటంతో వైసీపీ ముందు జాగ్రత్తగా పర్యటనలు ప్రారంభించిందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘నిఫా వైర‌స్‌’

ప్ర‌పంచం మొత్తం.. క‌రోనా భ‌యంతో వ‌ణికిపోతోంది. ఇప్పుడైతే ఈ ప్ర‌కంప‌న‌లు కాస్త త‌గ్గాయి గానీ, క‌రోనా వ్యాపించిన కొత్త‌లో... ఈ వైర‌స్ గురించి తెలుసుకుని అల్లాడిపోయారంతా. అస‌లు మ‌నిషి మ‌నుగ‌డ‌ని, శాస్త్ర సాంకేతిక...

సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను...

కాంగ్రెస్ పనైపోయింది..! ఉత్తమ్ పదవి వదిలేశారు..!

పీసీసీ చీఫ్ పోస్టుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తాను ఎప్పుడో రాజీనామా చేశానని.. దాన్ని ఆమోదించి.. కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించాలని ఆయన కొత్తగా ఏఐసిసికి లేఖ రాశారు....

గ్రేటర్ టర్న్ : టీఆర్ఎస్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..!

గ్రేటర్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యమైన ఫలితాలు సాధించింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కాస్త ముందు ఉన్నట్లుగా కనిపిస్తోంది కానీ.. భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్‌పై సర్జికల్‌ స్ట్రైక్...

HOT NEWS

[X] Close
[X] Close