జగన్ రెడ్డి రెండు వారాల గ్యాప్ వచ్చిందని ప్రెస్మీట్ పెట్టారు. గత వారం పూర్తిగా పెళ్లిళ్ల ప్రోగ్రామ్లకు తిరిగిన ఆయన ఈ సారి కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే తనది ప్రసంగం కాదు.. ప్రెస్మీట్ అని నమ్మించడానికి తన ఎదురుగా.. ఓ పది టీవీ చానళ్ల మైకుల్ని కనిపించేలా పెట్టుకుని వీడియో చేస్తున్నారు ఈ మధ్య. బుధవారం కూడా అదే చేశారు. ఆయన కొత్తగా ఏమీ చెప్పలేదు. ప్రతీ అంశంపై ఏడవడమే తప్ప…లాజికల్ గా ఫలానా అంశం తప్పు అని చెప్పారు. అది గూగుల్ డేటా సెంటర్ కాదంటారు…అదానీదేనంటారు. అదానీని తానే తెచ్చానంటారు. మళ్లీ అప్పనంగా భూములు ఇచ్చానంటారు. అయితే ఈ ప్రెస్మీట్ మొత్తం తర్వాత ఆయన అసలు బాధ మాత్రం ఓ మాటతో బయటపడిపోయింది. అదేమిటంటే చంద్రబాబు ఉప ప్రధాని అనే మాట.
నితష్ కుమార్ రాజ్యసభకు వెళ్లిన తరవాత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారని ఆయనను ఉప ప్రధానిని చేయవచ్చన్న ప్రచారం ప్రారంభమయింది. దీనికి బేస్ లేదు. అయినా సరే చంద్రబాబు ఉప ప్రధాని అయిపోతారేమోనన్న కంగారు జగన్ లో కనిపించింది. సీఎంగానే భరించలేకపోతున్నారు.. ఇక ఉప ప్రధాని అయిపోతారా అని ఆయన కుళ్లు అంతా బయట పెట్టుకున్నారు. జగన్ రెడ్డిని ఓ సారి సీఎం చేసి.. భరించ లేక కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు వెళ్లగొట్టారు. ఆయనకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసెంబ్లీకి కూడా పోవడం లేదు. ఇప్పుడు చంద్రబాబు ఉప ప్రధాని అయితే ఆయన తట్టుకోలేనట్లుగా మాట్లాడుతున్నారు.
తన స్పీచ్ లో జగన్ చంద్రబాబు, లోకష్, పవన్ పై ఏడవడం తప్ప.. ఫలానా విమర్శ నిక్కచ్చిగా చేశారని చెప్పడానికి అవకాశం లేదు. గతంలో ట్వీట్లు పెట్టినవి.. మండలిలో బొత్స చెప్పి పరువు పోగొట్టుకున్నవి.. ఇలాఅన్నీ రీసైకిల్ చేసి తీసుకు వచ్చి చెప్పారు. జగన్ రెడ్డి ప్రెస్మీట్లు పెట్టి వాటిలో ఆయన మాట్లాడే మాటల్ని మీమ్ క్రియేటర్స్ కు కంటెంట్ గా ఇవ్వడం తప్ప.. పలానా అంశంపై ఆయన కన్స్ట్రక్టివ్ గా మాట్లాడారని చెప్పడానికి లేకుండా పోయింది. ఇంకా కామెడీ ఏమిటంటే.. అన్ని మైకులు ఆయన ముందు ఉంటాయి.. ఒక్క జర్నలిస్టుకైనా ప్రశ్నించే అవకాశం రాదు. వారి మొహాలు చూపించరు. కానీ తనకు టైం అయిపోయిందని..ఆకలవుతుందని చెప్పి వెళ్లిపోయే బిట్ మాత్రం ఎడిట్ చేయకుండా సాక్షి టీం రిలీజ్ చేస్తుంది.


