అమిత్ షా బిజీ..! జగన్ ఢిల్లీ టూర్ కాన్సిల్..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. కానీ అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో.. అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. దాంతో.. జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. కొద్ది రోజుల కిందటే.. జగన్ ఢిల్లీకి వెళ్లి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముప్పావు గంట సేపు సమావేశమయ్యారు. అంతకు ముందు రోజే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా.. ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. ఆ రోజే.. అమిత్ షాతోనూ.. గంటకుపైగా చర్చలు జరిపారు. కానీ.. జగన్ కు మాత్రం.. తర్వాతి రోజు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. దాంతో.. మోడీతో సమావేశమై తిరిగి వచ్చేశారు. అప్పట్నుంచి షా సమయం కోసం చూస్తున్నారు. ఈ రోజు అమిత్ షా ఢిల్లీలోనే ఉంటారని వచ్చిన సమాచారం మేరకు..ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలోనే ఉండటంతో.. ఆగిపోయారు.

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విషయంలో సీబీఐ ఇటీవలి కాలంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినందున… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని… జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ కౌంటర్ వేసింది. సీఎం అయినందునే మినహాయింపు ఇస్తే.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొంది. అంతేకాదు.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారని కూడా వాదించింది. బెయిల్ కూడా రద్దు చేయమనేలా.. సీబీఐ వాదనలు ఉండటం వైసీపీ వర్గాల్లోనూ కలకలం రేపింది.

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోతే… జగన్మోహన్ రెడ్డి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉంటూ.. ప్రతీ వారం కోర్టుకు హాజరయితే… తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజీనామాకు డిమాండ్లు వినిపిస్తాయి. అందుకే… వైసీపీ వర్గాలు … సీబీఐ .. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేలా.. వాదనలు కాస్తంత సున్నితంగా మార్చుకుంటే బాగుటుందనే అంచనాల్లో ఉన్నాయి. వీటి కోసమే.. ప్రస్తుతం వైసీపీ నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాతో సమావేశమైతే.. పరిస్థితుల్లో కొంత మార్పు రావచ్చని వైసీపీ ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. షా మాత్రం సమయం కేటాయించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close