చంద్రబాబు బాటలోనే విద్యుత్ పీపీఏలు..! ఇప్పుడు స్వచ్చమా..?

చంద్రబాబుపై ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేదికపైన.. ఆయన ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లపై తీవ్ర విమర్శలు చేశారు. అవసరానికి మించి సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని.. దాని వల్ల భారీ అవినీతి జరిగిందని.. వాటన్నింటినీ బయట పెడతామన్నారు. బయట పెట్టలేదు .. అవినీతి లాంటిదేమీ లేదని కేంద్రానికి చెప్పాల్సి వచ్చింది. అన్నింటికంటే ఇప్పుడు.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఎలా పీపీఏలు కుదుర్చుకుందో.. ఇప్పుడు కూడా.. ఏపీ సర్కార్ అలాగే పీపీఏలు కుదుర్చుకుంటోంది.. ఒక్కటంటే.. ఒక్క నిబంధన కూడా మార్చలేదు. ఏవి తప్పని ఆరోపణలు చేశారో.. అవే నిబంధనలు కొనసాగిస్తోంది.

విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు… కనీసం పాతికేళ్ల పాటు ఒప్పందాలను ప్రభుత్వాలు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి గ్యారంటీ ఉంటేనే.. తాము యూనిట్లు పెడతామని.. విద్యుత్ ఉత్పాదక సంస్థలు చెబుతాయి. ఎందుకంటే… వేల కోట్లు పెట్టుబడి పెట్టి.. ఒకటి, రెండేళ్ల తర్వాత తమకు విద్యుత్ వద్దని ప్రభుత్వం అంటే… ఆ సంస్థ పెట్టుబడి వృధా అవుతుంది. అయితే.. పాతికేళ్ల పాటు ఒప్పందాలు చేసుకోవడమే తప్పిదమని… రాను రాను సంప్రదాయేతర విద్యుత్ చార్జీలు తగ్గుతాయని.. ఇదో పెద్ద స్కామ్ అని జగన్ ఆరోపించారు. తన ఆరోపణలకు తగ్గట్లుగా ఇక ఏపీ సర్కార్ చేసుకోబోయే పీపీఏలు పదిహేనేళ్లకు మాత్రమే ఉంటాయని జీవో తీసుకు వచ్చారు. ఒక్కటంటే.. ఒక్క నెలలోనే ఆ జీవో వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలిసి వచ్చినట్లుగా ఉంది నెల రోజుల్లోనే ఈ విధానంపై ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకొంది. కేంద్ర ప్రభుత్వ సౌర విద్యుత్‌ కార్పొరేషన్‌ తాను కుదుర్చుకొనే పీపీఏలకు పాతికేళ్ల కాల పరిమితి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

బొగ్గు కొరత పెరిగిపోతూండటం…జల విద్యుత్ పై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో గత ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌ను భారీగా ప్రోత్సహించింది. కేంద్రం కనీసం ఎనిమిది శాతం విద్యుత్ ను ఆ రంగం నుంచి వచ్చేలా చూసుకోవాలని సూచించింది. చంద్రబాబు హయాంలో అంత కంటే ఎక్కువగానే ప్రోత్సహించారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు పట్టారు. ఇలా చేయడం… వల్ల భారం పడుతోందని ఆరోపణలు చేశారు. చివరికి ఇప్పుడు.. చంద్రబాబు కంటే ఎక్కువగా .. ఎకంగా ప్రత్యేకంగా వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ పదివేల మెగావాట్ల సంప్రదాయోతర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పుడు వీటికే ఒప్పందాలు చేసుకుంటున్నారు.

విద్యుత్ పీపీఏల విషయంలో.. ఏపీ సర్కార్ మొదట్లో వ్యవహరించిన తీరుతో.. దేశంలో పెట్టుబడుల వాతారవణం దెబ్బతిన్నది. కల్లాం అజేయరెడ్డి లాంటి వారి సలహాలతో.. పీపీఏల్లో అవినీతి జరిగిందని…జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్మి.. విద్యుత్ కంపెనీలను కోర్టుల పాలు చేశారు. ఈ వ్యవహారం.. ప్రపంచ పెట్టుబడిదారుల్లో అపనమ్మకం పెంచింది. ఇప్పుడు.. ముఖ్యమంత్రి రియలైజ్ అయినా.. ఆ నమ్మకం రావడం కష్టం. మారిన పరిస్థితుల్లో పెట్టుబడులు సాధించడం అంత తేలిక కాదన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close