పార్టీ అధినేత ప్రెస్ మీట్ పెడితే అది ఆ పార్టీ సోషల్ మీడియాకు స్టఫ్ ఇవ్వడమే. వైసీపీ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటోంది. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే వైసీపీకి ఇచ్చే స్టఫ్ కన్నా టీడీపీకి ఇచ్చే స్టఫే ఎక్కువగా ఉంటుంది. తాజాగా మీడియా ముంగిటకు వచ్చిన జగన్..మరోసారి టీడీపీ సోషల్ మీడియాకి ఫుల్ స్టఫ్ ఇచ్చి వెళ్లారు.
ఏదో చెప్పాలనుకున్నారో , ఇచ్చిన స్క్రిప్ట్ లో అలాగే ఉందో కానీ చంద్రబాబు హయాంలో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు జగన్. లిక్కర్ , ఇసుక పంపిణీలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ దందా కళ్లముందే ఉంది. అందుకు సూత్రధారి ఎవరు అంటే అన్ని వేలు జగన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. అలాగే , వైసీపీ హయాంలో పేలాలు బొక్కినట్లుగా ఇసుకను బుక్కేసి గ్రామాల్లో కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి వైసీపీ నేతలు పెద్దఎత్తున సొమ్ము చేసుకున్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే ఇసుకను పంపిణీ చేస్తోంది.అవినీతికి ఆస్కారం లేకుండా నూతన లిక్కర్ పాలసీని రూపొందించింది.అయితే, ఏ రంగాల్లోనైతే వైసీపీ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందో సరిగ్గా అదే రంగంలో కూటమి అవినీతి చేస్తోందని చెప్పుకున్నారు జగన్.
ఇది జగన్ రెడ్డి తన తెలివికి తాను ఇచ్చుకునే క్రెడిట్ కావొచ్చు. కానీ, వాస్తవం ఏంటో ప్రజలకు తెలియదా ? ఇప్పటికీ ప్రజలను ఎందుకు అజ్ఞానులుగా ఎలా భావిస్తున్నారో ఆయనకే తెలియాలి.మొత్తంగా జగన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు అన్ని ఆయనకు కౌంటర్ ఇచ్చుకునేలా ఉండటంతో టీడీపీ సోషల్ మీడియాకు ఫుల్ పని పెట్టి వెళ్లారని అంటున్నారు.