ఏడాది యాత్ర 6 : మేనిఫెస్టోలో అమలు చేసిందెంత..? చేయాల్సిందెంత..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టి ఏడాది అవుతోంది. జగన్ బైబిల్‌లా చెప్పుకునే మేనిఫెస్టోలో ఎంత వరకూ అమలు చేశారనే దానిపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేశామని మంత్రులు సర్టిఫికెట్ జారీ చేసేసుకున్నారు. నిజానికి పాలనకు మూడు నెలలు ముగిసినప్పటి నుండి ఇదే వాదన వినిపిస్తున్నారు. మూడు నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని ప్రకటించారు. ఆ తర్వాత ఆరు నెలలప్పుడు.. ఆ తర్వాత తొమ్మిది నెలలప్పుడు.. ఇప్పుడు పన్నెండు నెలలప్పుడూ అదే వాదన వినిపిస్తున్నారు. వైసీపీ నేతల కోణంలో అలాగే అనిపించొచ్చు. మరి సామాన్యుల కోణంలో.. మేనిఫెస్టో ఎంత వరకూ అమలయింది..? పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయి..?

నవరత్నాల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్న సీఎం జగన్.!

ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలాగైనా నెరవేర్చాలన్నది సీఎం జగన్ సంకల్పం. ఆయన సంకల్పంలో ఒక్క శాతం కూడా తేడా ఉండదు. ఏడాది కాలంలో ఆయన.. చాలా శ్రమపడి.. అనేక పథకాన్ని అమలు దశకు తీసుకు వచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను.. సాధ్యమైనంత వరకూ అమలు చేశారు. ఆర్థిక పరిమితులు ఆయన ముందరి కాళ్లకు చాలా సార్లు బంధం వేయడానికి ప్రయత్నించాయి. ఎలాగోలా ఆయన.. తప్పించుకుని పథకాలను అమలు చేశారు. ఫ్లాగ్ షిప్ పథకం రైతుభరోసాను.. మేలో ప్రారంభిస్తామని చెప్పారు. కానీ పదవి చేపట్టేనాటికే మే అయిపోయింది. అందుకే అక్టోబర్‌లో ఇచ్చారు. ఆ తర్వాత అమ్మఒడి పథకం ఎలా ఇస్తారు..? అని చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ ఇచ్చారు. అందరికీ ఇళ్ల స్థలాల కోసం.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. పరిమితంగా ఉన్న ఆర్థిక వనరులతోనే.. ఇళ్ల స్థలాల సేకరణ చేసి రెడీ చేస్తున్నారు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఆ స్థలాల పంపిణీ కూడా పూర్తయ్యేదే. వీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి.. తన శక్తివంచన లేకుండా అమలుకు ప్రయత్నిస్తున్నారు.

పంచిన రత్నాలు కొన్నే.. పంచాల్సినవి ఎన్నో..!

మేనిఫెస్టోలోని నవరత్నాల్లో అత్యంత కీలకమైన పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. అందులో అత్యంత భారీ ఖర్చుతో కూడుకుని.. అత్యధిక లబ్దిదారులకు చేరాల్సిన రత్నాలుఉన్నాయి. వీటిలో మొదటిది వైఎస్ఆర్ చేయూత. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేయడానికి సంక్షేమ క్యాలెండర్‌లో చోటు కల్పించారు. సామాజిక పించన్లను రూ. మూడు వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. కానీ ఏడాది దాటిపోయినా… రెండో దశ పెంపు ప్రకటన ఇంకా చేయలేదు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ దిశగా ఇంత వరకూ ఎలాంటి కార్యాచరణ లేదు. అయితే.. ఈ ఏడాది చేయబోతామని విడుదల చేసిన కార్యక్రమాల్లో ఈ పథకం ఉంది. నాయీ బ్రాహ్మణు, టైలర్లు, రజకులు, న్యాయవాదులు, కుల వృత్తిదారులు, చిరు వ్యాపారులు ఇలా అన్ని వర్గాలకు ఆర్థిక సాయం అందించే పథకాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. కానీ తొలి ఏడాది అమలు చేయలేదు.

సీపీఎస్ నుంచి అగ్రిగోల్డ్ వరకు.. ఎన్నో మరకలు..!

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని ఉద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఏడాది దాటింది కానీ.. ఆ మాటే వినిపించడం లేదు. సకాలంలో పీఆర్సీ ఇస్తామన్నారు…అదీ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామన్నారు జరగలేదు. టీడీపీ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగిందని.. తాను రాగానే తొలి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించి.. బాధితులందరికీ పంచేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ప్రత్యేకంగా కాలమ్ పెట్టి మరీ హామీ ఇచ్చారు. ఏడాదిలో బడ్జెట్‌లో కేటాయించారు కానీ.. గత ప్రభుత్వం… వివిధ ఆస్తుల అమ్మకాల ద్వారా సేకరించి పెట్టిన మొత్తాన్ని మాత్రమే.. ఈ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకుంటారు.. ఆ సొమ్ములు ఇస్తారని నమ్మకంగా చెప్పడం లేదు.

కులాల కార్పొరేషన్ల నిధులన్నీ అమ్మఒడికిమళ్లింపు..!

బలహీన వర్గాలయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు వారి స్వయం ఉపాది పథకాల కోసం ఉద్దేశించిన కార్పొరేషన్లను ఈ సర్కార్ దాదాపుగా నిర్వీర్యం చేసింది. ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి వాటిని అమ్మఒడి పథకానికి .. ఇతర పథకాలకు మళ్లిస్తోంది. సాంకేతికంగా.. కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తున్నారు కానీ.. అవి అమ్మఒడి పేరుతో చెల్లించేస్తున్నారు. ఫలితంగా.. ఆయా వర్గాలు ఆర్థికంగా పైకి రావడానికి అవసరమైన ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఉపాధి కోసం… ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ఇతర కార్పొరేషన్లలోనూ అదే తీరు. ఈ కార్పొరేషన్ల ద్వారా ఆయా కులాల్లోని యువత ఉపాధి పొందేది ఇప్పుడు అది లేదు.

టీడీపీ హయాంలో పథకాలన్నీ నిలిపివేత మైనస్..!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్లను ప్రజలు ఎంత గానో ఆదరించారు. ప్రజల్లో వచ్చిన మంచి పేరునూ చూసి.. వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా.. రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నిలిపివేశారు. అన్న క్యాంటీన్ మాత్రమే కాదు.. ప్రజలను ఆపదలో ఆదుకున్న మరో పథకం…చంద్రన్న బీమా. ఆంధ్రప్రదేశ్‌లోని సగానికిపైగా కుటుంబాలకు భరోసా ఆ పథకం ఇచ్చింది. దాన్నీ నిలిపివేశారు. వైసీపీ మేనిఫెస్టోలో వర్గాల వారీగా..ఎవరైనా ఆనారోగ్యంతో చనిపోతే.. ఐదు లక్షల సాయం చేస్తామని దాదాపుగా అన్ని వర్గాలకు హామీ ఇచ్చారు. కానీ చనిపోయిన ఏ ఒక్కరికీ సాయం ఇప్పటి వరకూ అందలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేసేశారు. 4, 5 విడతల బకాయిలను చెల్లించడానికి బడ్జెట్ ఆమోదం తెలిపి.. ఈ ఏడాది మార్చి 10న జీవో 38ని విడుదల చేసింది. దాన్ని జగన్ రద్దు చేశారు. ఫలితంగా రైతులకు దక్కాల్సిన 7,959 కోట్లు ఆగిపోయాయి. నిరుద్యోగ యువతకు భృతి ఇస్తూ.. శిక్షణ ఇచ్చి.. పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా.. ముఖ్యమంత్రి యువ నేస్తం పథకానికి ఏపీ సర్కార్ రూపకల్పన చేసింది.దాన్ని కూడా జగన్ సర్కార్ నిలిపివేసింది. అన్ని వర్గాల పేదలు..అన్ని పండుగలు.. డబ్బు ఖర్చు అనే భయం లేకుండా జరుపుకోవాలన్న ఉద్దేశంతో చంద్రన్న కానుక, రంజాన్ తోఫాలను టీడీపీ సర్కార్ పంపిణీ చేసింది. కొత్త ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. పండుగలకు.. ఎవరికీ సాయం అందడం లేదు. బీసీ వర్గాలు..కులవృత్తులు చేసుకునేందుకు వీలుగా వారికి పని ముట్లు అందించేందుకు.. ఆదరణ పథకం టీడీపీ హయంలో ప్రవేశపెట్టారు. దాన్నీ రద్దు చేశారు. ఆ పథకం కింద పంపిణీ చేయాల్సినవి ఇప్పటికీ… గోడౌన్లలోనే ఉన్నాయి. చంద్రన్న చేయూత, గిరిజన ఫుడ్‌ బాస్కెట్‌, అన్న అమృతహస్తం పథకాలను రద్దు చేశారు. రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసేపథకం కూడా ఆగిపోయింది. వెనుకబడిన వర్గాలకు.. విదేశాల్లోచదువు కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేసేవారు. దాన్నీ నిలిపివేశారు. సివిల్స్‌లో కోచింగ్ తీసుకోవాలనుకునే విద్యార్థులకు సాయం అందించే పథకాన్నీ రద్దు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే..దాదాపుగా అన్ని వర్గాలకు మేలు కలిగే.. 50 పథకాలను రద్దు చేశారు. రద్దు చేసిన పథకాల స్థానంలో కొత్త పథకాలు అయినా ప్రవేశపెట్టి ఉంటే.. ప్రజలకు మేలు జరిగేదని..కానీ ప్రభుత్వం అలాంటి ఆలోచనలే చేయకపోడంతో.. ప్రతి ఒక్క వర్గం ప్రజలు నష్టపోతున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close