షూటింగుల‌కు రానంటున్న హీరోయిన్‌

లాక్ డౌన్ నిబంధ‌న‌ల నుంచి చిత్ర‌సీమ‌కు కొన్ని మిన‌హాయింపులు ల‌భించాయి. ప‌రిమిత‌మైన సిబ్బందితో షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. జూన్ మొద‌టి వారం నుంచి చిత్రీక‌ర‌ణ‌లు జ‌రిగే ఛాన్స్ ఉంది. అయితే షూటింగులు మొద‌లైనా కొంత‌మంది హీరోలు సెట్లోకి రావ‌డానికి జంకుతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. `క‌రోనా త‌గ్గేంత వ‌ర‌కూ మేం రాం` అని నిర్మాత‌ల‌కు మొహం మీదే చెప్పేస్తున్నార్ట‌. దాంతో షూటింగులు మొద‌లెట్టొచ్చ‌న్న నిర్మాత‌ల ఆనందంపై నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది.

హీరోలే కాదు, హీరోయిన్లూ ఇప్పుడు షూటింగ్ అంటే గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు. క‌రోనా భ‌యంతో షూటింగులు చేయ‌డం క‌ష్ట‌మే అని లావ‌ణ్య త్రిపాఠీ తేల్చి చెప్పింది. మ‌రో అగ్ర క‌థానాయిక అయితే ”నేన‌ప్పుడే షూటింగుల‌కు రాలేను. త‌ప్ప‌ద‌నుకుంటే నా స్థానంలో మ‌రో క‌థానాయిక‌ని తీసుకోండి” అని నిర్మాత‌ల‌కు ముందే చెప్పేసింద‌ట‌. అయితే అది సాదాసీదా సినిమా కాదు. స్టార్ హీరో, స్టార్ ద‌ర్శ‌కుడు క‌లిసి చేస్తున్న సినిమా. అలాంటి అవ‌కాశాన్ని కూడా ఆ క‌థానాయిక వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిందంటే, చిత్ర‌సీమ‌లో ఎలాంటి భ‌యాలు ఉన్నాయో అర్థ‌మ‌వుతోంది. హీరోలే భ‌య‌ప‌డుతున్నారంటే, వాళ్ల‌కు ఇప్పుడు హీరోయిన్లూ తోడ‌వుతున్నారు. ఇలాగైతే షూటింగులు జ‌రిగేదెలా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close