‘ఎఫ్ 3’ త‌ర‌వాతే ఏదైనా…

లాక్ డౌన్ స‌మ‌యాన్ని సంపూర్ణంగా స‌ద్వినియోగం చేసుకున్న ద‌ర్శ‌కుల‌లో అనిల్ రావిపూడి ఒక‌రు. సొంత ఊరిలో ఉంటూనే `ఎఫ్ 3` సినిమా స్క్రిప్టుని పూర్తి చేసేశాడు. షూటింగుల‌కు ఎప్పుడు అనుమ‌తి వ‌స్తే అప్పుడు సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అయ్యాడు. అయితే ఈలోగా మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎఫ్ 3 కంటే ముందు బాల‌కృష్ణ‌తో అనిల్ రావిపూడి ఓ సినిమా చేస్తాడ‌ని, అందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పుకుంటున్నారు. బాల‌య్య‌తో ఓసినిమా చేయాల‌ని అనిల్ రావిపూడి ఇది వ‌ర‌కే అనుకున్నాడు. `రామారావు గారు` అనే స్క్రిప్టు త‌న ద‌గ్గ‌ర రెడీగా ఉంది. అందుకే ఈ వార్త‌ల‌కు ఊతం వ‌చ్చింది.

కానీ అనిల్ రావిపూడి ఆలోచ‌న‌లు వేరుగా ఉన్నాయి. త‌న దృష్టంతా ఇప్పుడు ఎఫ్ 3 త‌ర‌వాతే. ఈ సినిమాని ముందు ప‌ట్టాలెక్కించి పూర్తి చేశాకే మ‌రో సినిమా జోలికి వెళ్తానంటున్నాడు. వ‌రుస విజ‌యాల‌తో అనిల్ బిగ్ లీగ్‌లోకి చేరిపోయాడు. ఎఫ్ 3నీ హిట్ చేసేస్తే.. త‌న స్థానం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. అందుకే ఎఫ్ 3పై గురి పెట్టాడు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు మ‌రో క‌థానాయ‌కుడికీ ఈ సినిమాలో చోటుంది. కాక‌పోతే అది అతిథి పాత్ర మాత్ర‌మే. ఆ హీరోని ఫిక్స్ చేసుకోవ‌డంలో రావిపూడి త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. బాల‌య్య‌తో అనిల్ త‌ప్ప‌కుండా సినిమా చేస్తాడ‌ని, అయితే దానికి ఇంకా టైమ్ ఉంద‌ని ఆయ‌న సన్నిహితులు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదానీకి మధురవాడలో 130 ఎకరాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు ఏర్పాటుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సుల మేరకు డేటా సెంటర్ పార్కు, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి...

కేసీఆర్ అంతకన్నా ఎక్కువే అన్నారుగా..! అప్పుడు కోపం రాలేదా..!?

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వైఎస్ కుటుంబాన్ని తాను కించపర్చలేదని.. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఇంతకీ...

తిరుపతి సీటు కోసం ఢిల్లీకి పవన్, నాదెండ్ల ..!

బీజేపీకి మద్దతుగా గ్రేటర్ ఎన్నికల బరి నుంచి వైదొలిగిన పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరిపేందుకు నాదెండ్ల మనోహర్‌తో...

గుడ్ న్యూస్‌: థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు ఓ జీవోని విడుద‌ల చేసింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. సిట్టింగ్ సామ‌ర్థ్యాన్ని 50 శాతానికి ప‌రిమితం చేసింది. ప్ర‌తి ప్రేక్ష‌కుడూ.....

HOT NEWS

[X] Close
[X] Close