కేసుల వలలో టీవీ 5 ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుని మరీ కేసులు పెడుతుందో.. అలా జరిగిపోతున్నాయో కానీ.. తమకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకుంటున్న వారందరిపైనా కేసులతో ఎదురుదాడి చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పెట్టే కార్యకర్తల దగ్గర్నుంచి మీడియాలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేసే.. టీవీ చానల్స్ వరకూ దేన్నీ వదిలి పెట్టడం లేదు. తాజాగా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు, ఆ చానల్ యాంకర్ మూర్తిలపై కేసు పెట్టినట్లుగా వెలుగులోకి వచ్చింది. టీవీ5లో కొన్నాళ్ల కిందట… యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకాల గురించిన వార్త వచ్చింది.

ఆ వార్తలో.. ఓ నోట్ ఫైల్ లాంటిదాన్ని చూపించారు. ఆ నోట్ ఫైల్.. రహస్యం అని.. దాన్ని టీవీ5 దొంగింలించడమో.. ఫోర్జరీ చేయడమో జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని కోరుతూ.. ఉన్నత విద్యాశాఖను చూస్తున్న సతీష్ చంద్ర అనే ఉన్నతాధికారి ఫిర్యాదు చేశారు. వెంటనే… పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ వన్ గా శ్రావణ్ కుమార్ అనే లాయర్‌ను చూపించారు. ఏ 2గా టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు.. ఏ 3గా… ఈ వార్తను ప్రజెంట్ చేసిన.. మూర్తి ఉన్నారు. ఈ కేసులు పెట్టడానికి గతంలో విడుదల చేసిన.. మీడియా జీవోను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఎలాగైనా టీవీ5ని టార్గెట్ చేయాలనుకున్నట్లుగా.. కొన్ని రోజులుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు అవకాశం దొరికినట్లయింది.

ఈ వార్తను ప్రసారం చేసి నెల దాటిపోయింది. అయినా ఇప్పుడే ఎందుకు కేసు పెట్టారో.. సులువుగానే అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కేసులో విషయం ఏమిటంటే.. ఆ వార్తను తప్పు అని చెప్పడం లేదు. తన శాఖలోని నోట్ ఫైల్ బయటకు వెళ్లింది.. వాళ్లకు ఎలా వెళ్లింది.. అన్నదానిపైనే సతీష్ చంద్ర ఫిర్యాదు చేశారు. అమరావతిలో ఉండే ఉన్నత విద్యాశాఖ కార్యాలయానికి టీవీ5 చైర్మన్, యాంకర్ వెళ్లి.. ఎలా తీసుకొస్తారని భావించారో మరి..! . కొద్ది రోజుల క్రితం మూర్తిని అరెస్ట్ చేసేందుకు సీఐడీ బృందాలు హైదరాబాద్ కు వచ్చాయని ప్రచారం జరిగింది. ఈ కేసు ద్వారా అరెస్ట్ ను నిజం చేస్తారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close