అవినీతిపై అవే నీతులు..! సబ్ కమిటీ కూడా చేతులెత్తేసినట్లే..!?

అవినీతిని బయట పెట్టడానికి ఆరు వారాల గడువు పెట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..సబ్ కమిటీలు, నిపుణుల కమిటీలు వేశారు. అన్నింటికీ ఆరు వారాల గడువు ఇచ్చారు. అయితే.. ఆరు వారాలు గడువు ముగిసినప్పటికీ… ఆ కమిటీలతో సమావేశాలు పెట్టి… ఇంకా అంతటా అవినీతి కనిపిస్తోందని లెక్చరిస్తున్నారే తప్ప.. ఫలానా దాంట్లో.. ఇంత అవినీతి జరిగిందని.. ఆధారాలు బయటపెట్టి.. సంబంధికులపై చర్యలు తీసుకునే వరకూ.. ముందడుగు వేయలేకపోతున్నారు. ఏడు వారాల కిందట… గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించి.. అవినీతిని వెలికి తీయాలని..కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఆరువారాల గడువిచ్చారు. ఆ తర్వాత ఒకటి , రెండు సార్లు రివ్యూ చేశారు. గడువు ముగిసిన తర్వాత మళ్లీ మరోసారి ఆ కమిటీతో సమావేశమయ్యారు. అవినీతిపై.. ఆ కమిటీ సంచలనాత్మకమైన విషయాలేమైనా బయట పెడుతుందేమో.. అని చాలా మంది అనుకున్నారు కానీ… మళ్లీ ఆ భేటీ.. జగన్మోహన్ రెడ్డి.. నీతి వాక్యాలకే పరిమితమయింది.

అవినీతిపై పోరాడే క్రమంలో.. తనపై ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయని..స్వయంగా జగన్మోహన్ రెడ్డినే చెప్పుకుని.. వీరోచితంగా… వాటిని ఎదుర్కొంటున్నట్లుగా ప్రకటించారు. రివర్స్‌ టెండరింగ్‌పై వెనక్కి తగ్గేది లేదని… అవినీతిపై పోరాటంలో ఒత్తిళ్లకు తలొగ్గొద్దని…కమిటీకి కూడా సూచించారు. గత ప్రభుత్వం టెండర్లలో అన్నీ కుంభకోణాలే కనిపిస్తున్నాయని… చివరికి తీసుకున్న రుణాల్లోనూ స్కాములు జరిగాయని.. ఆవేదన చెందారు. రివర్స్‌ టెండరింగ్‌పై వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల మిగిలే ప్రతిపైసా ప్రజలకే చెందుతుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దేశంలోనే అత్యున్నత విధానాలతో అవినీతిరహిత పాలనను అందించే… ప్రతి ప్రయత్నానికి గట్టిగా సహకరించాలని సూచించారు.

గత ఐదేళ్ల పాలనలో ప్రతి దాంట్లోనూ అవినీతి జరిగిందని… ప్రస్తుత సీఎం కుండ బద్దలు కొడుతున్నారు. వాటి సంగతి తేలుస్తానంటూ… అదే పనిగా చెబుతున్నారు. అవినీతి అంటే గిట్టదని.. చెబుతున్నారు. కానీ.. అసలు గతంలో ఏం అవినీతి జరిగిందో.. గత రెండున్నర నెలల పాలనలో ఒక్కటంటే.. ఒక్కటీ బయట పెట్టలేకపోయారు. దాంతో… జగన్మోహన్ రెడ్డి చెబుతున్న నీతి వాక్యాల మీద… గత ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న ఆరోపణలపై సీరియస్ నెస్ లేకుండా పోతోందన్న అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close