ఎలక్షన్ ఫీవర్ : తానూ విదేశీ పర్యటన రద్దు చేసుకున్న జగన్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల అధినేతలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న అంచనాలతో ఇప్పటి నుండే కంగారు పడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మిగతా బృందాన్ని మాత్రం పంపిస్తున్నారు. అదే సమయంలో.. లండన్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా…. బ్రిటన్ పర్యటన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా.. చివరి క్షణంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు.. ఓ సారి లండన్ వెళ్లిన ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత వెళ్లాలనుకున్నారు. కానీ ఎన్నికల ఫీవర్ పట్టేసింది.

కేటీఆర్‌తో లోటస్‌పాండ్‌లో జరిగిన చర్చల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. ప్రజలపై.. ఆ మీటింగ్ ప్రభావం తీవ్రంగా ఉందన్న చర్చ నడుస్తోంది. అది పాజిటివ్ నా.. నెగటివ్ నా… అన్నది వైసీపీ సీనియర్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. పరిస్థితి తేడాగానే ఉందని గమనించిన జగన్.. కీలకమైన సమయంలో పది రోజుల పాటు తాను రాజకీయాలను పట్టించుకోకపోతే… మొత్తానికే తేడా వస్తుందేమోనన్న సందేహంతో.. జగన్మోహన్ రెడ్డి… ఏం జరిగినా.. డిఫెండ్ చేసుకోవడానికి తాను అందుబాటులో ఉండటమే మంచిదన్న భావనకు వచ్చారు. పార్టీ సీనియర్ నేతలు కూడా అదే చెప్పడంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… దావోస్ పర్యటన వాయిదా వేసుకోవడంతో.. అనూహ్య రాజకీయ పరిణామాలు ఏమైనా జరిగినా జరగొచ్చన్న ఉద్దేశానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఏపీలో రాజకీయాలు.. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే హీటెక్కాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగడం.. అక్కడ ఎన్నికల ఫలితాలు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తూండటమే దీనికి కారణం అన్న అభిప్రాయం ఉంది. లెక్క ప్రకారం ఫిబ్రవరి చివరి వారం లేదా .. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు అధినేతలిద్దరూ.. మరింత రసవత్తరమైన పోటాపోటీ రాజకీయ వ్యూహాలు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

ఈవారం బాక్సాఫీస్‌: మూడింటితో స‌రి

మార్చిలో బాక్సాఫీస్ జాత‌కం ఏం మార‌లేదు. సంక్రాంతి త‌ర‌వాత స‌రైన స‌క్సెస్ లేని తెలుగు సినిమాకు గ‌త లో కూడా మొండి చేయే ఎదురైంది. ఏకంగా ఏడెనిమిది సినిమాలు వ‌రుస క‌ట్టినా, ఒక్క...

గవర్నర్ తమిళిశై రాజీనామా – చెన్నై నుంచి ఎంపీగా పోటీ !

తెలంగాణ గవర్నర్ తమిళిసై సొందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా దృవీకరించలేదు.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close