ఏడాది యాత్ర 10: విపత్తుల్లో సర్కారే ప్రజలకు అదనపు భారం..!

కృష్ణా వరదలతో ఇన్నింగ్స్ ప్రారంభమయింది. కరోనా ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. మధ్యలో గోదావరి బోటు ప్రమాదం, ఎల్జీ పాలిమర్స్ లాంటి విపత్తులు వచ్చి పడ్డాయి. ఈ విపత్తుల సమయంలో.. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందా అంటే.. సమాధానం కోసం వెదుక్కోవాల్సిన ప్రశ్న. ఈ విపత్తుల్లో కొన్నింటి విషయంలో ప్రభుత్వం ప్రజలు బలైపోయినా పర్వాలేదు.. తమకు రాజకీయ ప్రయోజనాలు సిద్ధిస్తే చాలన్నట్లుగా వ్యవహరించిందనే ఆరోపణలూ వచ్చాయి. కరోనా విషయంలో ముఖ్యమంత్రి చేసిన నిర్లక్ష్య ప్రకటనలు… వైసీపీ నేతల లాక్ డౌన్ ఉల్లంఘనలు చర్చనీయాంశమయ్యాయి. అంతేనా.. ఈ కరోనా కాలంలో ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వారి నుంచి బాదేస్తున్నారన్న ఆరోపణలూ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.

కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్న అధికారం.. అధికార పార్టీ నేతలు..!

ప్రపంచాన్ని ఇప్పటికీ గడగడలాడిస్తున్న కరోనా వైరస్ .. ఆంధ్రప్రదేశ్‌నూ వదిలి పెట్టలేదు. స్థానిక ఎన్నికల కోసం… వైరస్‌ను అతి తేలిగ్గా ప్రభుత్వం తీసుకుంది. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్‌తో పోతుందని.. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కానీ పరిస్థితి సీరియస్‌గా మారే సరికి లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. సీఎం తీరును చూసిన అధికారులు కూడా.. అదే పద్దతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైసీపీ నేతలు కూడా అంతే. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్‌ను స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చిన అవకాశంగా మార్చుకున్నారు. సాయం పంపిణీ పేరుతో.. ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా..పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. వాటి వల్ల కరోనా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందిందనే విమర్శలు వచ్చాయి. శ్రీకాళహస్తిలో ఒకటి, రెండు కేసులు ఉన్నప్పుడు అక్కడి ఎమ్మెల్యే ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ విపరీతంగా కేసులు పెరిగిపోయాయి. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించడంతో.. హైకోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. అదే సమయంలో..కరోనాను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ వచ్చాయి. కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో… రేగిన దుమారం అంతా ఇంతా కాదు. చత్తీస్‌ఘడ్ మంత్రి ట్వీట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ అవినీతి బాగోతంలో వైసీపీ నేతలు.. అనేక రకాలుగా వాదనలు చేశారు. ఆ కిట్లు వేరు.. ఈకిట్లు వేరని చెప్పుకొచ్చారు. చివరికి…చత్తీస్‌ఘడ్‌ చెల్లించిన ధరనే చెల్లిస్తామని చెప్పుకొచ్చి.. ఎవరి తప్పు లేదన్నట్లుగా అక్కడితో ఆ వివాదాన్ని ముగించేశారు.

ప్రజలకు ఆదాయం లేకపోయినా ప్రజల్ని బాదేసిన ప్రభుత్వం…!

ప్రజలు లాక్ డౌన్ పాటించడం ప్రారంభించిన తర్వాత… ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. కానీ ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు మాత్రం.. ఆశ్చర్య పరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రోజు కూలీలు, చిరు వ్యాపారుల, ఆటో, కారు డ్రైవర్లు.. ఇలా రోజువారీ సంపాదన మీద ఆధారపడే అత్యధికం. రెండు నెలల పాటు వారందరికీ ఆదాయం పడిపోయింది. కుటుంబానికి పదివేల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్న డిమాండ్లు అన్ని వైపుల నుంచి వినిపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే… అదీ కూడా… కొత్త రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం పేదలందరికీ రూ. పదిహేను వందలు చొపప్పున రెండు నెలలు ఇచ్చింది. అంటే మూడు వేలు ఇచ్చింది. ప్రజలకు ఆదాయం లేదనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ.. మద్యం ధరలు 75 శాతం పెంచింది. కరోనా కారణంగా ఒక్క నెలలో కరెంట్ బిల్లు రీడింగ్ తీయకపోవడాన్ని ఆసరా చేసుకుని బిల్లులను పెంచేశారు. కరెంట్ బిల్లులు రద్దు చేస్తారని ప్రజలు ఆశ పడుతున్న సమయంలో.. బిల్లులతో ఇలా బాదేయడం.. ప్రజల్ని అసహనానికి గురి చేస్తోంది.

కృష్ణా వరదల నిర్వహణా లోపం.. వేల కుటుంబాలకు శాపం..!

వైసీపీ అధికారం చేపట్టిన తర్వతా కృష్ణానదికి గతేడాది ఆగస్టు నెలలో వరదలొచ్చాయి. పదేళ్ల తర్వాత కృష్ణానదికి భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు..భారీ వర్షాలు లేవు. ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తింది. ఈ వరదల కారణంగా కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. సుమారు 700 టీఎంసీల నీరు వృథాగా సముద్రంపాలైంది. కృష్ణానదికి ఇంత భారీ ఎత్తున వరద వస్తే.. సాధారణంగా.. ప్రభుత్వాలు పకడ్బందీగా ఉపయోగించుకుంటాయి. రాయలసీమకు వీలైనంతగా తరలించుకుంటాయి. 820 అడుగలకు శ్రీశైలం చేరక ముందే ముచ్చుమర్రి నుంచి నీరు తీసుకునే సదుపాయం 840 అడుగలకు చేరగానే పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే వరకూ.. ప్రభుత్వం సైలెంట్ గా ఉండిపోయింది. ఓ సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్ట్ పై నుంచి నీరు పొంగిపోవడం… ఆందోళన రెకెత్తించింది. ఇలా ప్రభుత్వం ఎందుకు రాయలసీమకు నీరు తరలించకుండా.. నిల్వబెట్టిందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ.. ఆ నీటిని ఒక్క సారిగా దిగువకు విడుదల చేసేశారు. ఫలితంగా పరీవాహక ప్రాంతంలో ఇళ్లు, పంట పొలాలన్నీ మునిగిపోయాయి. ఫ్లడ్ మేనేజ్ మెంట్ ప్రభుత్వానికి చేతకాలేదంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి కానీ.. ప్లాన్ ప్రకారమే… అలా చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. భారీగా వచ్చే వరదను ఒక్క సారిగా వరదను వదలడం ద్వారా… కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంట్లోకి నీరు వెళ్లేలా చేస్తే.. ఆ ఇంటిని ముంపు ప్రాంతంగా ప్రకటించి.. కూలగొట్టవచ్చన్న ఉద్దేశంతోనే.. ఇలా చేసిందని అలాగే రాజధానిని ముంపు ప్రాంతంగా ప్రకటించాలన్న ఉద్దేశం ఉందని ఆరోపణలు వచ్చాయి. దానికి తగ్గట్లుగానే.. ఆ నీటిని పై నుంచి వదిలినప్పుడు.. చంద్రబాబు ఇంట్లోకి నీరు వస్తే.. చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లతో నిఘా వేశారు. అయితే..చంద్రబాబు ఇంట్లోకి నీరు రాలేదు కానీ.. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. వారికి ఇంత వరకూ పరిహారం అందలేదు

మానవ తప్పిదాల విపత్తుల్లో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిచిందా..?

వరదలు ప్రకృతి విపత్తు. మానవ తప్పిదాల వల్ల జరిగిన భారీ ప్రమాదాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి గోదావరిలో బోటు ప్రమాదం .. రెండు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం భిన్నంగా వ్యవహరించింది. గోదావరి ఉద్ధృతంగా ఉన్న సమయంలో… నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలోకి వెళ్లిన పర్యాటక బోటు కచ్చులూరు వద్ద మునిగిపోయింది. బోటును బయటకు తీయడానికి 38 రోజులు పట్టింది. ఇప్పటికీ 12 మంది ఆచూకీ తెలియలేదు..!. బోటు ప్రమాదం జరిగినప్పటి నుండి ప్రభుత్వం తీరు.. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ నెల ఏడో తేదీన వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ లో స్టెరీన్ లీకేజీ వ్యవహరం దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. గ్యాస్ లీకైన ఘటన రోజే సీఎం జగన్ వైజాగ్ హుటాహుటిన వెళ్లారు. కానీ ప్రభావిత గ్రామాల్లో పర్యటించలేదు. ఆస్పత్రిలో బాధితుల్ని పరామర్శించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. కానీ కంపెనీపై మాత్రం సానుభూతి చూపించారు. తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని ఆయన ఎక్కడా చెప్పలేదు. ముఖ్యమంత్రి మనోభీష్టం ఏమో కానీ..పోలీసులు కూడా… ఆ కంపెనీ జోలికి వెళ్లలేదు. చిన్న చిన్న కేసులు పెట్టి చోద్యం చూస్తున్నారు. కానీ ఆ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లపై కేసులు పెట్టారు.

ప్రభుత్వమే ప్రజలకు ఓ పెద్ద విపత్తు.. ఆ విపత్తు నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాలి కానీ.. ఆ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నుంచి ఎలా కాపాడుతుందని.. విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. ఏడాది కాలంలో విపత్తుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా లేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close