“బైజూస్‌” విషయంలో చైనాతో పోల్చుకోవచ్చుగా !

ప్రభుత్వ పాఠశాలల పిల్లలందర్నీ “బైజూస్‌”కు అప్పగించడాన్ని గొప్ప విద్యా సంస్కరణగా సీఎం జగన్ భావిస్తున్నారు. నిజానికి ఈ ఎడ్యూటెక్ యాప్‌లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాయని.. భారీగా డబ్బులు గుంజుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో వీటి విజృంభణ ప్రారంభం కాలేదు. బైజూస్ స్టార్టప్‌గా ప్రారంభించి కాస్త ఆదరణ పొందగానే పెట్టుబడులు సమీకరించి.. ఇతర ఎడ్యూటెక్ స్టార్టప్‌లను కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంది.

ఇలాంటి ఎడ్యూటెక్ కంపెనీలను చైనా ఇటీవల నిషేధించింది. ఆ దేశంలో కూడా పెద్ద ఎత్తున పలు ఎడ్యూటెక్ కంపెనీలు ప్రారంభమయ్యాయి. కొన్ని కంపెనీల విలువ లక్షల కోట్ల విలువైనవిగా ఎదిగాయి. అయితే అవి విద్యార్థుల మనుసులను కలుషితం చేసి..లాభార్జన చేస్తున్నాయని.. విద్యను లాభాల కోసం వాడుతున్నారని చైనా అధ్యక్షుడు వాటిపై అనేక ఆంక్షలు విధించారు. ఫలితంగా ఆ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుందని తెలిసిన భావి చైనా పౌరుల భవిష్యత్ దృష్ట్యా వాటిని చైనా అధ్యక్షుడు నియంత్రించేశారు. ఎడ్యూటెక్ యాప్‌లపై ఇప్పటికే అనేక దేశాల్లో ఆంక్షలు అమలు చేసే యోచనలో ఉన్నాయి.

తన వాదనకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని ఉదాహరణగా తీసుకోవడం సీఎం జగన్‌కు అలవాటు. ఆయన సలహాదారులు.. రీసెర్చర్లు వెదికి మరీ ఈ పోలికలు తెచ్చి జగన్‌కు ఇస్తూంటారు. జగన్ వల్లె వేస్తూంటారు. మూడు రాజధానులు ఎందుకు పెడుతున్నారంటే… అల్లదిగో దక్షిణాఫ్రికాలో ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక్క దక్షిణాఫ్రికాలోనే ఉంది. .మనకెందుకు అని చెప్పుకోలేదు. అది చేయాలనుకున్నారు కాబట్టి దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపించారు. తాజాగా టెన్త్ ఫలితాల విషయంలోనూ అదే దారి. గుజరాత్‌లో మన కంటే ఒక శాతం తక్కువగా వచ్చాయట. సీఎమ్మే స్వయంగా చెప్పారు. గుజరాత్‌లో టెన్త్ ఫలితాల స్థాయి మొదటి నుంచి అదే. కానీ ఏపీలో తొంభై శాతం నుంచి దిగజారిపోవడం గురించి మాత్రం చెప్పరు.

ఇప్పుడు బైజూస్ విషయంలో చైనాను ఎందుకు ఆదర్శంగా తీసుకోరన్న ప్రశ్న వస్తోంది. పిల్లలకు మంచి జరుగుతుంది కదా అనే ఓ వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. కాస్ట్‌లీ చదువులను ఇస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఆన్ లైన్‌ చదువు అనే సంగతి మర్చిపోతున్నారు. ఆన్ లైన్ చదువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బైజూస్‌కే అలవాటు పడితే ఇక ఏపీలో టీచర్ల అవసరమే ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close