నారా లోకేష్ అహ్మదాబాద్ వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తూంటే.. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బెంగళూరు ప్యాలెస్ లో టీవీలో క్రికెట్ చూస్తూ.. ఓ పుస్తకం లాంటి ట్వీట్ రాశారు. దాన్ని మ్యాచ్ అయిపోయిన తర్వాత పోస్టు చేశారు. అందులో ఎంత మ్యాటర్ ఉందంటే.. ట్వీట్ రాశావా.. పుస్తకమా అన్నా అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే ఆశ్చర్యపోయారు.
అయితే స్టార్టింగ్ చదివిన తర్వాత అందరికీ అందులో ఏముంటుందో తెలిసిపోతుంది. అసెంబ్లీకి వెళ్లకుండా… వెళ్లిన వారిపై ఏడుపులు అందులో ఉన్నాయి. ఎమ్మెల్యేలు సంస్కృతికి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. ఇక మహిళాభ్యుదయం గురించి చాలా చెప్పారు.తానేదో బటన్లు నొక్కి లక్షలు లక్షలు ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. అరకొరగా ఇచ్చి.. అన్ని బకాయిలు పెట్టి పోయారు. ఏమీ ఇవ్వనందుకు.. ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుున్నందుకు.. అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు బండకేసి కొట్టారు. అయినా అవే అబద్దాలతో పుస్తకాల్లాంటి ట్వీట్లు రాస్తున్నారు.
జగన్ రెడ్డి తెలుగులో వీక్. ఈ విషయం ఆయనే చెప్పుకున్నారు. ఆయన ట్వీట్ రాయరు. సజ్జల సాక్షిలోని నిపుణులతో రాయిస్తారు. అది ఆయన పేరు మీద పోస్టు చేస్తారు. ఆ పోస్టు చేయడానికి కూడా బద్దకమే. ఎవరైనా రాత్రి పదిన్నరకు పోస్టు చేస్తారా..? .అది కూడా ప్రపంచకప్ లో ఇండియా గెలిచి అందరూ ఆ టైంలో .. సెలబ్రేషన్స్ చేసుకుంటున్నప్పుడు ఈ ఏడుపు ఎవరైనా ఏడుస్తారా.. జగన్ తప్ప?.


