దేకేది మనం కాకపోతే ఢిల్లీ కూడా దగ్గరే అని చెప్పేవాళ్లలో జగన్ రెడ్డి లాంటి వాళ్లు ముందు ఉంటారు. తాడేపల్లికి వచ్చానని తెలిపేందుకు వీలుగా ఏదో ఓ గుంపును పిలిపించుకుని వారిని ఉద్దేశించి మాట్లాడటం జగన్ స్టైల్. అలా ఈ సారి నల్లకోట్లు వేసుకున్న వారిని పిలిపించుకుని ముచ్చట్లు చెప్పారు. ప్రభుత్వంలో అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారు. ఆయన చెప్పే మాటలు వింటే జగన్ రెడ్డి పాలనలో ఇదే కదా జరిగింది అని ఎవరికైనా అనిపిస్తోంది.
మిగతా విషయాలు పక్కన పెడితే ఆయన చెప్పిన ఓ మాట మాత్రం అందర్నీ ఆకర్షించింది. అదేదమిటంటే.. ఇప్పుడు స్క్వేర్ ఫీట్‌కు అంటే చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే.. ఫైవ్ స్టార్ సౌకర్యాలతో ఇళ్లు వస్తున్నాయట. నిజంగా జగన్ రెడ్డి తన సూట్ కేసు కంపెనీల్లానే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి ఈ ధరకు ఫైవ్ స్టార్ కాదు.. కనీసం త్రీ స్టార్ ఇళ్లు కట్టించి ఇచ్చినా.. ఆయనకు జనం రుణపడిపోయి ఉంటారు.
ఇప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేని మామూలు అపార్టుమెంట్లలో మొండిగోడలు కట్టి ఇచ్చే బిల్డర్లు కూడా.. కనీసం స్క్వేర్ ఫీట్ కు ఐదు వేల రూపాయలు తక్కువ చెప్పడం లేదు. నగరానికి ఎంత దూరంగా ఉన్నా అదే రేట్. ఇక ఇంటీరియర్ కూడా కలిపి చేయాలంటే.. పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్మాణాలు జోరుగా సాగుతూంటే.. దానిలో స్కాములు చూడాలనుకుని.. ఆయన ఈ తరహా మాటలు వల్లే వేస్తున్నారు. ఎదురుగా కూర్చున్న వారు.. సైలెంట్ గా వింటున్నారని వారిని బకరాలు చేస్తున్నారు.
రూ. 4వేలకు ఫైవ్ స్టార్ సౌకర్యాలతో స్కేర్ ఫీట్ వస్తే.. రుషికొండ ప్యాలెస్ లో స్క్వేర్ ఫీట్‌కు అంతకు పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఎన్ని స్టార్లతో నిర్మించాలో ఆయనకే తెలియదు. ఆయన నిర్వాకాన్ని ప్రభుత్వం లెక్కలతో సహా బయటపెడితే.. ఆయన చెప్పే మాటలకు.. చేసే పనులకు తేడా ప్రజలకు అర్థమవుతుంది.