దూడల రాజేష్ ఎవరో నాకు తెలియదు: జగన్

హైదరాబాద్: విజయవాడలో బయటపడిన కాల్‌మనీ వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న దూడల రాజేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసిఉన్న ఫోటోను తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇవాళ బయటపెట్టారు. రాజేష్‌తో జగన్‌కు ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ విజయవాడ వచ్చినప్పుడల్లా అన్ని ఏర్పాట్లు చేసేది రాజేషేనని ఆరోపించారు.

జగన్ ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, దూడల రాజేష్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. అతను కాంగ్రెస్ కార్పొరేటర్‌గా పోటీచేసిన విషయం తెలుగుదేశం నేతలకు తెలుసని అన్నారు. అసెంబ్లీ కౌరవసభలాగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. కాల్‌మనీ గురించి మాట్లాడుతూ, మన ఇంట్లోని ఆడవాళ్ళకు ఇలా జరిగితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదని అన్నారు. కాల్ మనీ ఆరోపణలు వస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు వైసీపీ పార్టీ శాసనసభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని మంత్రి యనమల ప్రతిపాదిస్తే స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండు రోజులు సస్పెండ్ చేశారని జగన్ ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close