ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు సస్పెండ్, సభ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుండి ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు సస్పెండయ్యారు. సభా కార్యక్రమాలను రికార్డు చేస్తున్న కెమెరాలకు అడ్డుగా నిలబడి ఆటంకం కలిగిస్తున్నందుకు వైకాపా తుని ఎమ్మెల్యే రామలింగేశ్వరరావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిలను రెండు రోజుల పాటు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా దానిని స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు ఆమోదించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాల్ మనీ వ్యవహారంపై రేపు ఉదయం సభలో తను ప్రకటన చేస్తానని ఆ తరువాత సభ్యులు దానిపై చర్చించవచ్చని అన్నారు. కానీ వైకాపా సభ్యులు తక్షణమే దానిపై చర్చ చేపట్టాలని పట్టుబట్టడంతో స్పీకర్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసారు. కానీ వారు తమ పట్టు విడవకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. కనుక ఈరోజు శాసనసభ సభలోఒకరినొకరు విమర్శించుకోవడం ఎద్దేవా చేసుకోవడం మినహా ఎటువంటి చర్చా జరుగలేదు. రేపు చంద్రబాబు నాయుడు కాల్ మనీ వ్యవహారంపై ప్రకటన చేసిన తరువాత బహుశః మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడవచ్చును.

కాల్ మనీ వ్యవహారంలో తెదేపా ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తున్నానని వైకాపా భావిస్తున్నట్లుంది. కానీ నిజానికి వైకాపాయే అధికార తెదేపాకి ఈ ఇబ్బందికరమయిన సమస్యపై సంజాయిషీ చెప్పుకొనే అవసరం లేకుండా చేసిందని చెప్పవచ్చును. ఈ వ్యవహారంపై చర్చ జరగాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడటం వలన తెదేపా తప్పించుకోగలిగింది. అలాగే మిగిలిన సమస్యలపై కూడా ప్రభుత్వం ఎటువంటి సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేకుండానే తప్పించుకొనే అవకాశం వైకాపాయే కల్పిస్తోంది. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తెదేపాను ఇరుకున పెట్టామని సంబరపడుతుంటే తెదేపా నేతలు ముసిముసినవ్వులు నవ్వుకోవడం గమనిస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. మిగిలిన నాలుగు రోజులు కూడా ఇలాగే వైకాపా సభ్యులు రెచ్చిపోతే మళ్ళీ బడ్జెట్ సమావేశాల వరకు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close